నెలన్నర క్రితమే పెండ్లి.. నవవధువుకు నాలుగు నెలల గర్భం
Maharajganj | ఆమెకు నెలన్నర క్రితమే పెండ్లి అయింది. అయితే ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలడంతో అత్తింటివారు అవాక్కైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలోని మహారాజ్‌కు చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన ఓ యువతితో నెలన్నర క్రితం వివాహం అయింది.
లక్నో: ఆమెకు నెలన్నర క్రితమే పెండ్లి అయింది. అయితే ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలడంతో అత్తింటివారు అవాక్కైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్రంలోని మహారాజ్‌కు చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన ఓ యువతితో నెలన్నర క్రితం వివాహం అయింది. పెండ్లితంతు ముగియడంతో ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న ఆ యువకుడికి పిడుగులాంటి వార్త తెలిసింది. ఓరోజు ఆ నవవధువు తనకు కడుపు నొప్పిగా ఉందని భర్త, అత్తా మామలకు తెలిపింది. దీంతో వారు ఆమెను దవాఖానకు తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలింది.
పెండ్లయి నెలన్నరే అవుతుంటే నాలుగు నెలల గర్భం ఎలా వస్తుందని ఆశ్చర్యపోవడంతో వారి వంతయింది. తాము మోసపోయామని గ్రహించిన భర్త, అత్తమామలు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. అమ్మాయి తల్లిదండ్రులు తమను మోసం చేశారని, గర్భం గురించి ముందే తెలిసినప్పటికీ.. వివాహం జరిపించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

