Baby Flushed in Toilet | అప్పుడే పుట్టిన శిశువును.. ఆసుపత్రి టాయిలెట్లో పడేసి ఫ్లష్
Baby Flushed in Toilet | అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్‌లోని కమోడ్‌లో పడేసి ఫ్లష్ చేశారు. నీరు బ్లాక్ కావడంతో క్లీనింగ్ సిబ్బంది పరిశీలించారు. పైపుల్లో అడ్డుపడిన శిశువు మృతదేహాన్ని గుర్తించి షాక్ అయ్యారు.
బెంగళూరు: అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రి టాయిలెట్‌లోని కమోడ్‌లో పడేసి ఫ్లష్ చేశారు. (Baby Flushed in Toilet) నీరు బ్లాక్ కావడంతో క్లీనింగ్ సిబ్బంది పరిశీలించారు. పైపుల్లో అడ్డుపడిన శిశువు మృతదేహాన్ని గుర్తించి షాక్ అయ్యారు. కర్ణాటకలోని రాంనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హరోహళ్లిలోని ఆసుపత్రిలో మురుగు నీటి పైపులు బ్లాక్ అయ్యాయి. దీంతో క్లీనింగ్ సిబ్బంది, ప్లంబర్లు పరిశీలించారు. పైపుల్లో ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. బ్లాకేజీని తొలగించేందుకు ప్రయత్నించగా శిశువు మృతదేహం బయటపడింది.
కాగా, ఆసుపత్రి సిబ్బంది దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పసిబిడ్డ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన వారు ఇది బయటపడకుండా ఉండేందుకు ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.
మరోవైపు నవజాత శిశువు మిస్సింగ్‌పై ఆ ఆసుపత్రి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శిశువును బయట నుంచి తెచ్చి ఆసుపత్రిలోని కమోడ్‌లో పడేసి ఫ్లష్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

