అయితే కాలిఫోర్నియా.. లేకుంటే న్యూయార్క్!
అమెరికా.. ఎంతోమంది విద్యార్థుల ఆశల సౌధం. ఉన్నత విద్య కోసం అత్యధికులు క్యూకట్టే దేశం. అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నవారిలో ఎక్కువమంది కాలిఫోర్నియా బాట పడుతున్నారు.
- అమెరికాకు వెళ్లే వారిలో అత్యధికులు ఈ రాష్ర్టాలకే
- చదువుకు 10 రాష్ర్టాలనే ఎంచుకొంటున్న విద్యార్థులు
- న్యూయార్క్ వర్సిటీకే జై కొడుతున్న విదేశీ యువత
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): అమెరికా.. ఎంతోమంది విద్యార్థుల ఆశల సౌధం. ఉన్నత విద్య కోసం అత్యధికులు క్యూకట్టే దేశం. అక్కడ చదువుకోవడానికి వెళ్తున్నవారిలో ఎక్కువమంది కాలిఫోర్నియా బాట పడుతున్నారు. ఆ తర్వాత న్యూయార్క్ రాష్ర్టానికి ఓటేస్తున్నారు. 2021 -22 సంవత్సరానికి 9,48,519 మంది విదేశీ విద్యార్థులు అమెరికాకు వెళ్తే.. వారిలో 1.32 లక్షల మంది కాలిఫోర్నియాకు, 1.06 లక్షల మంది విద్యార్థులు న్యూయార్క్‌కు వెళ్లారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) ప్రచురించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కొవిడ్-19 అనంతర పరిస్థితులను ఈ నివేదికలో పొందుపరిచారు. కరోనా కారణంగా విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గినట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. 2020-21, 2021-22 విద్యా సంవత్సరాల్లో ఏటా 9 లక్షల మంది మాత్రమే అమెరికా వెళ్లగా.. 2017-18 నుంచి 2019-20 సంవత్సరాల్లో 10 లక్షలకు పైగా విద్యార్థులు అమెరికా విమానం ఎక్కారు.
న్యూయార్క్ వర్సిటీ టాప్
అత్యధిక విద్యార్థులు ఎంచుకొనే యూనివర్సిటీల్లో న్యూయార్క్ వర్సిటీ టాప్‌లో నిలిచింది. ఇందులో అత్యధికంగా 21,081 మంది విదేశీ విద్యార్థులు చేరారు. ఆ తర్వాత బోస్టన్లోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో 17,836 విద్యార్థులు చేరారు. కొలంబియాలో 16,956, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో 15,729, అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో 15,293 మంది అంతర్జాతీయ విద్యార్థులు ప్రవేశాలు పొందారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

