Malaria vaccine | మలేరియాకు కొత్త టీకా.. అభివృద్ధి చేస్తున్న జేఎన్‌యూ శాస్త్రవేత్తలు
Malaria vaccine | మలేరియా నిర్మూలన కోసం టీకాను అభివృద్ధి పరచడంలో ఢిల్లీలోని జేఎన్‌యూ శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు. మరింత సమర్థంగా మలేరియా నిరోధం, చికిత్సకు బాటలు వేశారు. ప్రొఫెసర్ శైలజ సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది.
న్యూఢిల్లీ: మలేరియా నిర్మూలన కోసం టీకాను అభివృద్ధి పరచడంలో ఢిల్లీలోని జేఎన్‌యూ శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు. మరింత సమర్థంగా మలేరియా నిరోధం, చికిత్సకు బాటలు వేశారు. ప్రొఫెసర్ శైలజ సింగ్, ప్రొఫెసర్ ఆనంద్ రంగనాథన్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. యాంటీ మలేరియల్ డ్రగ్స్ ప్రభావాన్ని నిరోధించగలిగే రోగ నిరోధక సామర్థ్యాన్ని దోమలు ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి.
మరోవైపు మలేరియాకు సమర్థవంతమైన టీకాలు లేవు. దీంతో ఈ ప్రాణాంతక మహమ్మారితో పోరాటంలో ప్రగతికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనిపై ప్రొఫెసర్ శైలజ మాట్లాడుతూ..మనిషిలో ఇన్ఫెక్షన్ను చొప్పించడానికి దోహదపడే రెండు తటస్థ అణువులు పీహెచ్బీ2-హెచ్ఎస్పీ70ఏ1ఏను గుర్తించినట్లు తెలిపారు. ఈ పారాసైట్ ప్రొటీన్ పీహెచ్బీ2 ఓ ప్రభావవంతమైన వ్యాక్సిన్‌కు దోహదం చేసే కారణం కాగలదన్నారు.
వివిధ సెల్యూలార్ ప్రాసెస్లను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే ప్రొటీన్ల కుటుంబం ప్రొహిబిటిన్స్ అని చెప్పారు. మరో పరిశోధకుడు మనీషా మరోథియా మాట్లాడుతూ, పీఎఫ్‌పీహెచ్‌బీ2 యాంటీబాడీల ఉనికి మలేరియా చికిత్సలో గొప్ప మలుపు అని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

