Mars | మార్స్‌పై నీటి జాడలు..! కీలక సమాచారం వెల్లడించిన నాసా క్యూరియాసిటీ రోవర్..!
Mars | ఈ అనంత విశ్వంలో ఎన్నో రహస్యాలున్నాయి. భూమిని పోలిన గ్రహాలతో పాటు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో మిస్టరీలను ఛేదించారు. మార్స్‌పై సైతం శాస్త్రవేత్తలో పరిశోధనలు చేపడుతున్న విషయం తెలిసిందే. మార్స్‌పై జీవం ఉన్నదా?అనే కోణంలో పరిశోధనలు సాగుతుండగా.. ఈ దిశగా కీలక పురోగతి చోటు చేసుకున్నది.
Mars | ఈ అనంత విశ్వంలో ఎన్నో రహస్యాలున్నాయి. భూమిని పోలిన గ్రహాలతో పాటు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో మిస్టరీలను ఛేదించారు. మార్స్‌పై సైతం శాస్త్రవేత్తలో పరిశోధనలు చేపడుతున్న విషయం తెలిసిందే. మార్స్‌పై జీవం ఉన్నదా?అనే కోణంలో పరిశోధనలు సాగుతుండగా.. ఈ దిశగా కీలక పురోగతి చోటు చేసుకున్నది. నాసా క్యూరియాసిటీ రోవర్ తాజాగా మార్స్‌పై ఓ రహస్య ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఈ ప్రాంతంలో అక్కడ భూగర్భంలో నీరు చాలాకాలం పాటు క్రియాశీలంగా ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఇది మార్స్ వాతావరణ చరిత్రను తిరగరాసే అవకాశం ఉన్నది.
నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుతం మౌంట్ షార్ప్ భాగంలోని బాక్స్వర్క్ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. ఇది మార్స్ ఉపరితలంపై 12 మైళ్ల పొడవున విస్తరించి ఉంది. ఇప్పటి వరకు ఇది కేవలం ఉపగ్రహాల ద్వారా మాత్రమే గమనించిన ఈ ప్రాంతానికి తొలిసారిగా రోవర్ చేరుకుంది. ఇక్కడి రాళ్లలో రాళ్లలో మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ వంటి ఉప్పు ఖనిజాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇవి సాధారణంగా నీరు ఆవిరైపోయిన తర్వాతే ఏర్పడుతాయి. దాంతో అక్కడ గతంలో నీరు ఉందని.. ఆ తర్వాత వాతావరణంలోని మార్పులతో ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నట్లుగా సూచిస్తున్నది. కేవలం మట్టి, ఖనిజాలే కాకుండా రాళ్లలో మినరల్ వీన్స్‌ని సైతం గుర్తించారు. నీరు చాలా కాలం పాటు భూగర్భంగా ప్రవహించి ఉండే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇది నిజమైతే, మార్స్‌పై జీవనానికి అనువైన వాతావరణం భావించిన దానికంటే ఎక్కువ కాలం పాటు కొనసాగినట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోవర్ రాళ్లను తవ్వి నమూనాలను సేకరిస్తోంది.
వాటిని విశ్లేషించగా మార్స్ జలరాశులకు సంబంధించిన చరిత్ర, గ్రహ నిర్మాణ పరిణామాలపై కీలక సమాచారం లభించే అవకాశం ఉంది. మార్స్‌తో పాటు ఇతర గ్రహాలు, పలు గ్రహాల ఉపగ్రహాల్లోనూ నీటి ఉనికిని గుర్తించారు. భూమి ఉపగ్రహమైన చంద్రుడి ఉపరితలంపై 2009లో భారత్ చేపట్టిన చంద్రయాన్-1 మిషన్ ద్వారా దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటి జాడలను గుర్తించారు. అలాగే, జూపిటర్ ఉపగ్రహమైన మూరోపాలోనూ మంచుతో కప్పిన ఉపరితంలోని లోతుల్లో భారీ జలరాశులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బృహస్పతి ఉపగ్రహమైన గానిమీడ్ భూగర్భంలో సముద్రం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శని ఉపగ్రమైన ఎన్సెలడస్ ఉపరితలంలో నీరు మంచురూపంలో ఉందని అంచనా. టైటాన్లో మీథేన్, ఇథేన్ నిండిన ఉపగ్రహం.. ఉపరితంలో నీటి సముద్రం ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

