Rishi Sunak | న్యూ డాన్.. డెత్ ఆఫ్ డెమొక్రసీ.. ప్రధానిగా రిషి ఎన్నికపై బ్రిటిష్ మీడియా సెటైర్లు !
Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికపై ఆ దేశ మీడియా .. న్యూ డాన్.. డెత్ ఆఫ్ డెమొక్రసీ అని శీర్షికలు పెట్టింది.
Rishi Sunak | బ్రిటన్ ప్రధానిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన భారత సంతతికి చెందిన రిషి సునాక్‌కు దేశీయ మీడియా నుంచి విమర్శలు, ప్రశంసలు స్వాగతం పలికాయి. కొన్ని దిన పత్రికలు ‘న్యూ డాన్’ అని పేర్లు పెట్టాయి. మరికొన్ని ఆయన విజయం చెల్లుబాటును ప్రశ్నించాయి. స్కాట్లాండ్ డైలీ రికార్డ్.. ‘ప్రజాస్వామ్యానికి యమపాశం (Death of democracy)’ అనే శీర్షిక పెట్టింది.
సోమవారం బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ (42)కు ఈ దఫా దీపావళి వెరీ స్పెషల్. 210 ఏండ్లలో కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాని రిషి సునాక్. ఒకనాడు దాదాపు ప్రపంచ దేశాలపై వలస పాలన సాగించిన యునైటెడ్ కింగ్డమ్ ప్రధానిగా ఎన్నికైన రిషి ఫొటోగ్రాఫ్.. దేశంలోని అన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురితమైంది. బ్రిటన్‌లోని దిన పత్రికలన్నీ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికవ్వడం పట్ల సంతోషంగా లేవని వాటి వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
రిషి సునాక్ తన సహచర టోరీ ఎంపీలకు హెచ్చరికలు జారీ చేశారని ప్రముఖ దిన పత్రిక ‘గార్డియన్’ పేర్కొంది. లండన్‌లోని కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన రిషి ఫొటో ప్రచురించింది.. దాని కింద ‘కలిసుందామా..? చనిపోదామా?’ అని టోరీ ఎంపీలకు హెచ్చరికలు జారీ చేశారని వ్యాఖ్య రాసింది. ఆరేండ్లలో ఐదో ప్రధాని, రెండు నెలల్లో మూడో కన్జర్వేటివ్ పార్టీ ప్రధాని సునాక్‌కు స్వాగతం అని పేర్కొంది. దేశానికి సారధ్యం వహిస్తున్న తొలి హిందూగా చరిత్ర లిఖించారని వ్యాఖ్యానించింది.
మెయిల్ కూడా దాదాపు ఇలాగే స్పందించింది. ‘బ్రిటన్‌కు ఒక కొత్త డాన్’ అని శీర్షిక పెట్టింది. ‘తొలిసారి ఆసియా వారసత్వంతో కూడిన యువ ఆధునిక ప్రధాని రిషి సునాక్‌కు స్వాగతం’ అని సబ్ హెడ్ ప్రచురించింది. మిర్రర్ మరో అడుగు ముందుకేసి ‘మా నూతన (ఎన్నుకోని) ప్రధాని’, ‘మీకు ఎవరు ఓటేశారు’ అని ప్రశ్నించింది. ‘కింగ్ కంటే రెండు రెట్లు సంపన్నుడు’ అనే శీర్షికలతో వార్తాకథనం ప్రచురించింది. ఇక ప్రభుత్వ వ్యయంపై క్రూరమైన పొదుపు చర్యలు (preside over brutal public spending cuts) చేపట్టేందుకు అధికారం ఆయన హస్తగతమైందని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది సన్ డే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతుల సంపద 730 మిలియన్ల బ్రిటన్ పౌండ్లు. ఇది కింగ్ చార్లెస్-3, క్వీన్ కన్సర్ట్ కెమిల్లా దంపతుల సంపద కంటే ఎక్కువ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

