Neuralink | మెదడులో ఎలాన్ మస్క్ చిప్.. పక్షవాతం వచ్చిన వ్యక్తితో చెస్ ఆడించేశారు
Neuralink | ఎలన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ .. ఓ పేషెంట్‌కు బ్రెయిన్ చిప్‌ను ఇంప్లాంట్ చేసింది. అయితే ఆ చిప్‌తో ఆ పేషెంట్ ఆన్లైన్ చెస్ ఆడాడు. ఆ గేమ్‌కు చెందిన ఆటను న్యూరాలింక్ కంపెనీ లైవ్ స్ట్రీమింగ్ చేసింది.
Neuralink | న్యూఢిల్లీ: ఎలన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ .. ఓ పేషెంట్‌కు బ్రెయిన్ చిప్‌ను ఇంప్లాంట్(Brain Chip Implant) చేసింది. అయితే ఆ చిప్‌తో ఆ పేషెంట్ ఆన్లైన్ చెస్ ఆడాడు. ఆ గేమ్‌కు చెందిన ఆటను న్యూరాలింక్ కంపెనీ లైవ్ స్ట్రీమింగ్ చేసింది. పక్షవాతం వచ్చి మెదడును వాడలేని వారికి.. వారి ఆలోచనలకు తగినట్లు బ్రెయిన్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మళ్లీ కదలికలు తీసుకువచ్చేందుకు న్యూరాలింక్ కంపెనీ ప్రయత్నిస్తున్నది. అయితే నోలాండ్ ఆర్బాగ్ అనే వ్యక్తికి ఇటీవల బ్రెయిన్ చిప్ పెట్టారు. ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కంప్యూటర్‌పై కర్సర్‌ను కదిలించాడు. ఇంప్లాంట్ చేసిన డివైస్ ఆధారంగా ఆ కర్సర్‌ను మూవ్ చేసినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆన్లైన్ చెస్ ఆడుతున్న 9 నిమిషాల వీడియోను ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. ఓ డ్రైవింగ్ యాక్సిడెంట్లో ఆర్బాగ్ భుజాల కింది భాగం చచ్చుబడిపోయింది. అతనికి జనవరిలో చిప్ ఇంప్లాట్ చేశారు. అయితే మానవ మస్తిష్కాలను.. కంప్యూటర్లతో కలపాలన్న ఉద్దేశంతో న్యూరాలింక్ కంపెనీ బ్రెయిన్ చిప్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఆర్బాగ్కు సర్జరీ చాలా ఈజీగా జరిగినట్లు కంపెనీ వెల్లడించింది. సివిలైజేషన్ సిక్స్ వీడియో గేమ్‌ను ఆడేందుకు బ్రెయిన్ ఇంప్లాంట్‌ను వాడినట్లు ఆర్బాగ్ తెలిపాడు. న్యూరాలింక్ కంపెనీ రూపొందించిన టెక్నాలజీతో అది సాధ్యమైందని, వరుసగా 8 గంటల పాటు ఆన్లైన్ చెస్ ఆడినట్లు అతను చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

