పీశిడి కేంద్ర మంత్రీ.. ఈ జీఎస్టీ పిండుడేంది?
తమదాకా వస్తే గానీ తత్వం బోధపడదని అంటారు. కేంద్రమంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తేకు అలాంటి అనుభవమే ఎదురైంది. గురువారం ఆయన మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా శివనీ వెళ్లారు. కారులో వెళ్తుంటే దారి పక్కన వేడివేడిగా కాల్చి అమ్ముతున్న మక్క కంకులు కనిపించాయి
- కాల్చిన కంకికి రూ.15 ఇచ్చేందుకు గింజుకున్న కేంద్రమంత్రి
- పన్ను బాదుడును గుర్తు చేస్తూ ఆటాడుకున్న నెటిజన్లు
న్యూఢిల్లీ, జూలై 22: తమదాకా వస్తే గానీ తత్వం బోధపడదని అంటారు. కేంద్రమంత్రి ఫగ్గన్‌సింగ్ కులస్తేకు అలాంటి అనుభవమే ఎదురైంది. గురువారం ఆయన మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా శివనీ వెళ్లారు. కారులో వెళ్తుంటే దారి పక్కన వేడివేడిగా కాల్చి అమ్ముతున్న మక్క కంకులు కనిపించాయి. వాటిని చూడగానే మంత్రికి నోరూరింది. కారాపి మూడు కాల్చిన కంకులకు నిమ్మరసం, ఉప్పు రాసి ఇవ్వమన్నారు. వాటిని అమ్మే పిల్లగాడు చక్కగా పేపర్లో చుట్టి మంత్రి చేతికిచ్చాడు. ఎంత అంటే అతడు రూ.45 అని చెప్పాడు.
మంత్రికి ఒక్కసారిగా అబ్బా అంత రేటా అన్నట్టు చూశారు. ఆ సంగతి బైయటపడనీయకుండా ఆ కుర్రాడితో ఏవో కబుర్లు చెప్పారు. బుడ్డోడి ‘బిజినెస్ లెక్కల’పై రిజిస్టరు ఉందా అని వాకబు చేశారు. తర్వాత ఆ అనుభవంపై మంత్రి ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దీనిపై నెటిజనులు ఆయనను ఓ లెవెల్లో ఆడుకుంటున్నారు. సామాన్యులపై జీఎస్టీ అంటూ, మరోటి అంటూ వీరబాదుడు బాదుతున్నారు. చివరికి పాలు, పెరుగును కూడా వదలక పన్నులు గుంజుతున్నారు. మరి ఆ కాస్తా 15 రూపాయలకే ‘అబ్బో’ అన్నట్టు మొఖం పెట్టడం ఏందని సెటైర్లు వేస్తున్నారు. కొంపదీసి కంకుల మీదా జీఎస్టీ బాదరు కదా! అని ఆహాశ్చర్యపోతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bargaining
- maize corn
- mock
- Netizens
RELATED ARTICLES
తాజా వార్తలు
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

