బీజేపీకి బిగ్ షాక్ : నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మేనల్లుడు రాజీనామా
కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మునిమేనల్లుడు చంద్రబోస్ బీజేపీకి రాజీనామా చేశారు. దివంగత నేత ఆశయాలను పార్టీ నెరవేర్చనందుకు నిరసనగా పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు చంద్రబోస్ ప్రకటించారు.
న్యూఢిల్లీ : కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మేనల్లుడు చంద్రబోస్ బీజేపీకి రాజీనామా చేశారు. దివంగత నేత ఆశయాలను పార్టీ నెరవేర్చనందుకు నిరసనగా పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు చంద్రబోస్ ప్రకటించారు. 2016లో బీజేపీలో చేరిన చంద్రబోస్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేశారు.
తాను బీజేపీలో చేరినప్పుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్, శరత్ చంద్ర బోస్‌ల సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు తనను అనుమతిస్తామని చెప్పారని, కానీ ఆ దిశగా ఏం జరగలేదని చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో బోస్‌ను పశ్చిమ బెంగాల్ ఉపాధ్యక్షుడిగా నియమించగా 2020లో పునర్వ్యవస్ధీకరణలో ఆయనకు చోటు దక్కలేదు. బీజేపీ వేదికగా దివంగత నేతల భావజాల వ్యాప్తికి దేశమంతా ప్రచారం చేయాలని భావించానని చెప్పుకొచ్చారు.
బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆజాద్ హింద్ మోర్చా స్ధాపించి కుల మతాలకు అతీతంగా నేతాజీ ఆలోచనల మేరకు అన్ని వర్గాలను భారతీయులుగా ఏకం చేయాలని అనుకున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపిన రాజీనామా లేఖలో ఆయన రాసుకొచ్చారు. తాను ప్రతిపాదించిన ఆలోచనలను కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పట్టించుకోలేదని, బెంగాలీలకు చేరువయ్యేందుకు తన సూచనలను కూడా పార్టీ పెద్దలు బుట్టదాఖలా చేశారని బోస్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
MLC Kavitha | మహిళా బిల్లుపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదు..? సోనియాకు కవిత సూటి ప్రశ్న
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

