లక్నో: ఈవ్ టీజర్లు ఒక యువతిని కదులుతున్న రైలు ముందుకు తోశారు. రైలు కింద పడిన ఆమె ఒక చేయి, రెండు కాళ్లు కోల్పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరేలీకి చెందిన 17 ఏళ్ల యువతి ఇంటర్ చదువుతున్నది. నీట్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్కు వెళ్తున్నది. ఇద్దరు ఈవ్ టీజర్లు ఆమె వెంటపడి వేధించసాగారు. మంగళవారం రాత్రి కోచింగ్ సెంటర్ నుంచి తిరిగి వస్తున్న ఆ యువతిని సీబీ గంజ్ ప్రాంతంలో ఆ ఇద్దరు యువకులు అడ్డుకుని వేధించారు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ప్రతిఘటించిన ఆమెను కదులుతున్న రైలు ముందుకు తోశారు.
కాగా, రైలు కింద పడిన ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఒక చేయి, రెండు కాళ్లు తెగి రక్తం మడుగుల్లో పడి ఉన్న ఆమెను ఇజ్జత్నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సర్జరీ చేసిన వైద్యులు తెగిన చేయి, రెండు కాళ్లను తొలగించారు. ఆ యువతి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఇద్దరు యువకుల వేధింపుల గురించి ఆ యువతి తన కుటుంబానికి చెప్పిందని బంధువులు తెలిపారు. యువకుల కుటుంబ సభ్యులకు దీని గురించి చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఒక యువకుడు, అతడి తండ్రిని అరెస్ట్ చేశారు.
కాగా, ఈ సంఘటన సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్, బీట్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. యువతి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.
यूपी के बरेली में छात्रा ने झेला शोहदों का आतंक। छेड़खानी का विरोध करने पर दो लड़कों ने उसे ट्रेन के आगे फेंका। कोचिंग से घर लौट समय छात्रा के साथ हुई घटना। छात्रा के एक हाथ और दोनों पैर कटे, कई हड्डियां भी टूटीं। अस्पताल में भर्ती छात्रा की हालत गंभीर। pic.twitter.com/REFqg5qWzs
— SANJAY TRIPATHI (@sanjayjourno) October 11, 2023
बरेली में छात्रा को छेड़खानी का विरोध करना पड़ा मंहगा, शोहदों ने छात्रा को ट्रेन के आगे फेंका,छात्रा के दोनो पैर और एक हाथ कटा,पुलिस ने एक लड़के किया गिरफ्तार दूसरे की तलाश फ़रार।
बरेली प्रकरण में अस्पताल पहुँचे SSP ,DM ने लिया पीड़िता का हालचाल. pic.twitter.com/9q9Vte3fJP
— Vineet Gupta (@aapka_vineet) October 11, 2023