Bulli Bai App | బుల్లి బాయ్ యాప్‌ను డెవలప్ చేసిన నీరజ్ బిష్ణోయ్ ఎవరు? ఎందుకు ఈ పని చేశాడు?
Bulli Bai App | రోజునే ముస్లిం మహిళల ఫోటోలను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయి
Bulli Bai App |ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బుల్లి బాయ్ యాప్ గురించే చర్చ. గత సంవత్సరం సుల్లి డీల్స్ పేరుతో సంచలనం సృష్టించిన ఈ యాప్.. కొత్త సంవత్సరం రోజునే ముస్లిం మహిళల ఫోటోలను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి సంచలనం సృష్టించింది. దీంతో దేశవ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయి.. ఆ యాప్‌ను వెంటనే బ్లాక్ చేసి.. దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ నీరజ్ బిష్ణోయ్‌ని తాజాగా అరెస్ట్ చేశారు.

నీరజ్ బిష్ణోయ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. వయసు 21 ఏళ్లు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ సెకండియర్ చదువుతున్న నీరజ్‌ది అస్సాంలోని జోర్హాట్ టౌన్. భోపాల్‌లోని వెల్లూరు కాలేజీలో నీరజ్ చదువుతున్నాడు. బుల్లి బాయ్ యాప్‌ను నీరజ్ డెవలప్ చేసినట్టు తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు.. జోర్హాట్ పోలీసులతో కలిసి వెంటనే అతడి ఇంటికి వెళ్లి నీరజ్‌ను అరెస్ట్ చేశారు. అతడు ఉపయోగిస్తున్న ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు.
నీరజ్ తండ్రి దశరథ్ షాప్‌కీపర్‌గా పనిచేస్తున్నాడు. తన కొడుకు అటువంటి వాడు కాదని.. చాలా అమాయకుడని చెబుతున్నాడు. మరోవైపు అరెస్ట్ అయిన తర్వాత నీరజ్ కూడా అదే విషయం చెబుతున్నాడు. తనకు ఏ పాపం తెలియదని.. తాను ఎటువంటి తప్పు చేయలేదని పోలీసుల ముందు నీరజ్ చెప్పినట్టు తెలుస్తోంది. తన ఫోటోను ఎవరైనా యూజ్ చేసుకొని కావాలని కేసులో ఇరికిస్తున్నారేమో అంటూ నీరజ్ అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఒకవేళ నిజంగానే నీరజ్ ఈ పని చేస్తే.. అసలు నీరజ్ ఎందుకు ముస్లిం మహిళలను టార్గెట్ చేసుకొని వాళ్ల ఫోటోలను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నాడో తెలుసుకోవడం కోసం పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇంతకుముందు.. నీరజ్‌కు ఏదైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

