ఒకే రన్‌వే పై భారత్‌కు వెళ్లే రెండు విమానాలు.. తృటిలో తప్పిన ముప్పు

న్యూఢిల్లీ: భారత్‌కు వెళ్లే రెండు విమానాలు టేకాఫ్ కోసం ఒకే సమయంలో ఒకే రన్‌పైకి చేరాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అప్రమత్తం కావడంతో ఆ రెండు విమానాలు ఢీకొనే ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నాయి. దీంతో రెండు విమానాల్లోని వందలాది మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.
గత ఆదివారం జనవరి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఎమిరేట్స్ విమానం ఈకే-524 టేకాఫ్‌కు బయలుదేరింది. రన్ వే 30ఆర్ పైకి అది వేగంగా సమీపిస్తున్నది. ఇంతలో దుబాయ్ నుంచి బెంగళూరు వెళ్లే మరో ఎమిరేట్స్ విమానం ఈకే-568 అదే రన్‌పై టేకాఫ్ కోసం వేగంగా వస్తున్నది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఏటీసీ దీనిని తృటిలో గుర్తించింది. హైదరాబాద్ వెళ్లే విమానం టేకాఫ్‌ను వెంటనే నిలిపివేసింది.
అయితే ఆ విమానం అప్పటికే 130 నాట్ల వేగాన్ని అందుకున్నది. ఏటీసీ ఆదేశంతో పైలట్లు వేగాన్ని తగ్గించారు. రన్‌వేకు 790 మీటర్ల దూరంలోని మరో లేన్‌కు మళ్లించి సురక్షితంగా నిలిపివేశారు. దీంతో రెండు విమానాలు దగ్గరగా వచ్చి ఢీకొనే ముప్పు తప్పింది.
కాగా, షెడ్యూల్ ప్రకారం రెండు ఎమిరేట్స్ విమానాలు బయలుదేరే సమయాల మధ్య ఐదు నిమిషాల గ్యాప్ మాత్రమే ఉంటడం ఈ తప్పిదానికి దారి తీసింది. తొలుత బెంగళూరు వెళ్లే విమానం ఏటీసీ క్లియరెన్స్ పొందడంతో టేకాఫ్‌కు బయలుదేరింది. అయితే ఏటీసీ క్లియరెన్స్ ఇవ్వనప్పటికీ హైదరాబాద్ వెళ్లే విమానం కూడా షెడ్యూల్ సమయానికి టేకాఫ్‌కు బయలుదేరడంతో ఈ ఘటన జరిగింది.
మరోవైపు యూఏఈకి చెందిన ది ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సెక్టార్ (ఏఏఐఎస్) ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. భద్రతాపరమైన ఉల్లంఘన జరిగినట్లు ఆరోపించింది. విమానం సిబ్బందిపై అంతర్గత విచారణ జరుపుతున్నది. కాగా, ఈ దర్యాప్తు నివేదికను తమకు అందించాలని ఏఏఐఎస్ను భారత్‌కు చెందిన డీజీసీఏ కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

