ఎన్డీఏలో మహిళల ప్రవేశానికి మేలో నోటిఫికేషన్

- సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతిస్తూ నోటిఫికేషన్‌ను వచ్చే ఏడాది మేలోపు విడుదల చేస్తామని రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్డీఏలో మహిళా అభ్యర్థుల ప్రవేశం, ఆపై వారికి శిక్షణ సజావుగా సాగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసి ఉంటుందని పేర్కొంది. ప్రవేశ పరీక్షకు హజరయ్యేందుకు కావలసిన ఎత్తు, బరువు తదితర అర్హతా ప్రమాణాలను నిర్ణయించే ప్రక్రియ జరుగుతున్నదని తెలిపింది. శిక్షణకు కరిక్యులమ్ రూపొందించేందుకు నిపుణులతో అధ్యయన బృందాన్ని నియమించామని వివరించింది. అర్హులైన మహిళలకు ఎన్డీఏలో ప్రవేశం లేకపోవడంపై న్యాయవాది కుష్ కల్రా దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. మహిళలను అనుమతించకపోవడం లింగ వివక్షే అవుతుందని, ఇది రాజ్యాంగ విలువలను అవమానించడమేనని కల్రా తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్డీఏ, నావల్ అకాడమీ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంటుంది. దీనికి 15-18 ఏండ్ల వయసుతో పాటు ఇతర అర్హతలు ఉన్న అవివాహితులైన పురుష అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తున్నారు. పరీక్షలో అర్హత సాధించి, శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత వారిని పర్మినెంట్ కమిషన్ అధికారిగా సర్వీసులోకి తీసుకుంటున్నారు. మహిళా అభ్యర్థులకు తగిన అర్హతలు ఉన్నా ఈ అవకాశం కల్పించడం లేదు. పిటిషన్‌పై విచారణ సందర్భంగా మహిళలకు ప్రవేశం కల్పించాలని సాయుధ దళాలు నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. తాజాగా దానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి నివేదిక సమర్పించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

