Go First: గోఫస్ట్‌కు భారీ ఊరట.. దివాళాకు ఓకే చెప్పిన కోర్టు
Go First: ఎన్సీఎల్టీ కోర్టులో గోఫస్ట్‌కు భారీ ఊరట దక్కింది. ఆ కంపెనీ పెట్టుకున్న స్వచ్ఛంద దివాళా అభ్యర్థనను కోర్టు ఆమోదించింది. పూర్తి పరిష్కారం దొరికే వరకు.. ఉద్యోగుల్ని తొలగించరాదు అని బెంచ్ తెలిపింది.
న్యూఢిల్లీ: స్వచ్ఛంధ దివాళాకు గోఫస్ట్(Go First) కంపెనీ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ అంశంలో గోఫస్ట్‌కు భారీ ఊరట దక్కింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) ఆ పిటీషన్‌ను ఆమోదించింది. దీంతో ఆ కంపెనీకి చెందిన అసెట్స్, లీజులకు రక్షణ దొరికింది. జస్టిస్ రామలింగం సుధాకర్, ఎల్ఎన్ గుప్తాలతో కూడిన ఎన్సీఎల్టీ బెంచ్ ఈ కేసులో ఆదేశాలు జారీ చేసింది. కార్పొరేట్ ఇన్సాల్వెన్సి రిజల్యూషన్ ప్రాసెస్(సీఐఆర్‌పీ) కింద ప్రక్రియ మొదలు పెట్టవచ్చు అని బెంచ్ తెలిపింది.
ఎయిర్‌లైన్స్ సంస్థ సజావుగా నడిచేందుకు అభిలేశ్ లాల్‌ను తాత్కాలిక పరిష్కర్తగా నియమించింది. ఐఆర్పీ వద్ద అయిదు కోట్లు డిపాజిట్ చేయాలని గోఫస్ట్ మేనేజ్మెంట్కు ఆదేశాలు జారీ చేశారు. అయితే కోర్టులో కేసు కొనసాగుతున్నంత కాలం సంస్థలో ఉద్యోగుల్ని తొలగించరాదు అని ఆదేశించారు. ఇక మే 19వ తేదీ వరకు విమానాలను సస్పెండ్ చేస్తున్నట్లు గోఫస్ట్ సంస్థ ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

