NCERT | తొమ్మిదో తరగతి పాఠ్యాంశంగా ఎమర్జెన్సీ.. పాఠ్య ప్రణాళికను సవరించిన ఎన్సీఈఆర్టీ
NCERT | భారతదేశ చరిత్ర (India's History) లో అత్యంత వివాదాస్పదమైన 1975 నాటి ఎమర్జెన్సీ (Emergency) ని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తొలిసారిగా పాఠ్యాంశాల్లో చేర్చింది. తొమ్మిదవ తరగతి సోషల్ సైన్స్ (Social Science) పాఠ్యపుస్తకంలో దీనికి సంబంధించిన నూతన అధ్యాయాన్ని ప్రవేశపెట్టింది.
NCERT : భారతదేశ చరిత్ర (India’s History) లో అత్యంత వివాదాస్పదమైన 1975 నాటి ఎమర్జెన్సీ (Emergency) ని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తొలిసారిగా పాఠ్యాంశాల్లో చేర్చింది. తొమ్మిదవ తరగతి సోషల్ సైన్స్ (Social Science) పాఠ్యపుస్తకంలో దీనికి సంబంధించిన నూతన అధ్యాయాన్ని ప్రవేశపెట్టింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో ఎమర్జెన్సీ ఒకటిగా ఈ పాఠంలో వివరించారు.
నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఎన్సీఈఆర్టీ తన పాఠ్యప్రణాళికను సవరించింది. ఇందులో భాగంగా 9వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన “అండర్స్టాండింగ్ సొసైటీ : ఇండియా అండ్ బియాండ్” పుస్తకంలో ఎమర్జెన్సీపై ప్రత్యేక విభాగాన్ని పొందుపరిచారు. ఆ కాలంలో ప్రాథమిక హక్కుల రద్దు, పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు, రాజకీయ ప్రత్యర్థుల అరెస్టులు వంటి అంశాలను ఈ పాఠ్యాంశంలో కూలంకషంగా వివరించారు.
ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతించారు. ఎమర్జెన్సీ వంటి చీకటి రోజులు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆనాటి చారిత్రక పరిణామాల గురించి భావి తరాలకు తెలియజేయడం అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. రాజ్యాంగ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అదే ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. అయితే సిలబస్‌లో చోటుచేసుకున్న ఈ మార్పులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వం చరిత్రను తమకు అనుకూలంగా వక్రీకరిస్తోందని ఆరోపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
City Park | అమ్మకానికి సిటీ పార్క్.. బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో హెచ్ఎండీఏ వ్యవహారం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

