Rave Party | సంచలనం.. రేవ్ పార్టీలో షారుక్‌ఖాన్ తనయుడు.. ప్రశ్నిస్తున్న ఎన్సీబీ
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. ముంబై తీరంలోని క్రూజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీ( Rave Party )కి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అతన్ని ప్రశ్నిస్తోంది.

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. ముంబై తీరంలోని క్రూజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీ( Rave Party )కి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అతన్ని ప్రశ్నిస్తోంది. శనివారం రాత్రి ఈ క్రూజ్ షిప్లో జరుగుతున్న రేవ్ పార్టీపై అధికారులు దాడి చేశారు. అయితే షారుక్ తనయుడు ఆర్యన్‌పై ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు కాలేదు. అతన్ని అరెస్ట్ కూడా చేయలేదని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె వెల్లడించారు. ఈ క్రూజ్ పార్టీ ప్లాన్ చేసిన ఆరుగురు ఆర్గనైజర్లకు కూడా ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ రేవ్ పార్టీలో ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ కాషిఫ్ ఖాన్ హస్తం కూడా ఉండటంతో ఆయనను కూడా ఎన్సీబీ ప్రశ్నిస్తోంది.
ఇప్పటికే ఆర్యన్ ఖాన్ ఫోన్‌ను ఎన్సీబీ సీజ్ చేసింది. అతడు డ్రగ్స్ తీసుకున్నాడా లేక అతని దగ్గర ఏవైనా డ్రగ్స్ ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. రేవ్ పార్టీ తర్వాత సీజ్ చేసిన ఫోన్లకు వచ్చిన మెసేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కొడుకు. ఆర్యన్‌తోపాటు ఈ రేవ్ పార్టీలో ప్రముఖ వ్యాపారవేత్తల కూతుళ్లు కూడా ఉన్నట్లు ఎన్సీబీ గుర్తించింది.
అసలేం జరిగింది?
క్రూజ్ షిప్‌పై దాడి చేసి అక్కడి నుంచి ఎక్స్టసీ, కొకైన్, మెఫిడ్రోన్, చరస్‌లాంటి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ వెల్లడించింది. ఈ దాడుల సందర్భంగా 8 మందిని అదుపులోకి తీసుకుంది. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కచ్చితమైన సమాచారంతోనే కార్డెలియా అనే ఈ క్రూజ్ షిప్‌పై దాడి చేసినట్లు ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ క్రూజ్ ముంబై నుంచి గోవా వెళ్తోంది. తమ క్రూజ్‌లో ప్రయాణిస్తున్న వాళ్ల దగ్గర నుంచి నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఈ క్రూజ్ ప్రెసిడెంట్, సీఈవో జుర్గెన్ బైలోమ్ తెలిపారు.
శనివారం రాత్రి బాలీవుడ్, ఫ్యాషన్, బిజినెస్ రంగాలకు చెందిన ప్రముఖలతో ఈ క్రూజ్ షిప్ మూడు రోజుల ప్రయాణానికి బయలు దేరింది. అయితే ఈ క్రూజ్ షిప్లో డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎన్సీబీ.. పక్కా ప్రణాళికతో దాడి చేసింది. ముంబై తీరం దాడి సముద్రం మధ్యలోకి వెళ్లగానే క్రూజ్‌లో రేవ్ పార్టీ ప్రారంభమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

