పాటియాలా: పాటియాలా సెంట్రల్ జైలులో నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్లర్క్‌గా పనిచేయనున్నారు. 1998 నాటి రోడ్డు దాడి కేసులో అతనికి ఇటీవల కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సిద్ధూ ఖైదీ నెంబర్ 241383. అతన్ని బరాక్ నెంబర్ 7లో ఉంచారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అతను సెల్ నుంచే పనిచేయనున్నారు. సిద్ధూ బరాక్కు ఫైల్స్‌ను పంపనున్నారు. తొలి మూడు నెలల ఖైదీలకు ఎటువంటి జీతం చెల్లించరు. ఆ తర్వాత రోజుకు రూ.90 వరకు ఇస్తారు. ఆ వేతనాన్ని అతని బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దోషులుగా తేలిన నేరస్థులు రోజుకు 8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. వారి జీతాన్ని ప్రభుత్వమే ఇస్తుంది.