నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే బ్రిడ్జిపై నావికా దళ అధికారి గుండెపోటుతో కుప్పకూలగా ట్రాఫిక్ కానిస్టేబుల్ చొరవతో ప్రాణాలు దక్కాయి. ముంబైలోని శాంతాక్రజ్ వెస్ట్ ఏరియాలోని వకోలా బ్రిడ్జిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
నావికా దళ అధికారి ప్రశాంత్ రాయ్ తన సహచరులతో కలిసి పోవై నుంచి వొర్లికి తన కారులో వెళుతుండగా ఛాతీ నొప్పితో కుప్పకూలారు. ఈ క్రమంలో ఆయన సహచరులు సమాచారం అందించడంతో ఆన్‌డ్యూటీ కానిస్టేబుల్ శ్రీకాంత్ నవ్లే కొద్దిసేపు వాహనాలను నిలిపివేసి తన బైక్‌పై వారి కారుకు దారి చూపుతూ కేవలం ఐదు నిమిషాల్లోనే అక్కడికి సమీపంలోని వీఎన్ దేశాయ్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఆ సమయంలో వీఐపీల రాకపోకలు అధికంగా ఉండటంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేయడం కష్టతరమైందని నవ్లే చెప్పారు. నేవీ అధికారి గుండెపోటుకు గురైన కొద్దినిమిషాలకే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు.
Read More :
Murder attempt | ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్‌పై హత్యాయత్నం..