Third Eye | మనుషులకూ మూడో కన్ను.. దృష్టి పరిణామ క్రమంలో కొత్త కోణం కనుగొన్న న్యూరో సైంటిస్ట్‌లు
Third Eye |న్యూజిలాండ్‌కు చెందిన ‘ట్యుటారా’ అనే వింతయిన బల్లిలాంటి జీవిని దగ్గరగా చూస్తే మీరు ఒక అద్భుతమైన విషయాన్ని గమనించవచ్చు. అదే.. పని చేసే మూడో కన్ను. ట్యుటారా తలకు ఇరువైపులా ఉండే ప్రధాన కండ్లలాగే ఈ మూడో కన్ను కూడా లెన్స్, రెటీనా, మెదడుకు అనుసంధానించబడిన నరాలను కలిగి ఉంటుంది.
Third Eye | న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌కు చెందిన ‘ట్యుటారా’ అనే వింతయిన బల్లిలాంటి జీవిని దగ్గరగా చూస్తే మీరు ఒక అద్భుతమైన విషయాన్ని గమనించవచ్చు. అదే.. పని చేసే మూడో కన్ను. ట్యుటారా తలకు ఇరువైపులా ఉండే ప్రధాన కండ్లలాగే ఈ మూడో కన్ను కూడా లెన్స్, రెటీనా, మెదడుకు అనుసంధానించబడిన నరాలను కలిగి ఉంటుంది. సరీసృపం వంటి వెన్నెముక ఉన్న జీవికి ఇంతటి అధునాతనమైన మూడో కన్ను ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ నిజం ఏమిటంటే మానవులకూ అలాంటిది ఒకటి ఉంది. ‘పీనియల్ గ్రంథి’ అని పిలిచే ఈ కన్ను పుర్రె కింద మెదడు లోపల లోతుగా దాగి ఉంటుంది. నేరుగా సూర్యకాంతి తగలకుండా ఉన్నప్పటికీ కాంతి, చీకట్లకు మన శరీరం ఎలా స్పందించాలో నిర్దేశించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తున్నది.
‘కరెంట్ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త పరికల్పన అసలు ఈ చిన్న గ్రంథి ఎక్కడి నుంచి వచ్చిందో వివరించడానికి ప్రయత్నిస్తున్నది. మూడో కన్ను మన అత్యంత పురాతన పూర్వీకుల నుంచి వచ్చిందని ఈ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అలాగే దీనిని అర్థం చేసుకోవడం ద్వారా దృష్టి పరిణామ క్రమంలో ఉన్న అత్యంత లోతైన చిక్కుముడులలో ఒకదానికి ఎట్టకేలకు సమాధానం దొరకవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్‌కు చెందిన న్యూరోసైంటిస్ట్, ఈ కొత్త అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ థామస్ బాడెన్ ప్రకారం.. పూర్వం మనం నిస్సారమైన సముద్రాలలో సముద్రగర్భం వెంబడి పాకే ఒక చిన్న పురుగు వంటి జీవి కంటే పెద్దగా ఏమీ లేము. ఇది నావిగేషన్ కోసం రెండు పక్క కండ్లను, కాంతి స్థాయిలను ట్రాక్ చేయడానికి, స్థిరంగా ఉండడానికి తలపై ఒక సాధారణ మధ్య కన్నును కలిగి ఉండే అవకాశం ఉంది. తర్వాత ఏదో మార్పు జరిగింది. చివరికి వెన్నెముక జీవులుగా మారే మన పూర్వీకులు తమ తలలను ఇసుకలో పాతుకోవడం ప్రారంభించారు. అడుగున ఉన్న అవక్షేపాలలో పూడుకుపోయి, పక్కనే తేలియాడే కణాలను ఆహారంగా తీసుకుంటూ బతికే వీటికి ఇకపై నావిగేట్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
అప్పటివరకు పెద్దగా ఉపయోగపడని, నిర్వహించడానికి ఎక్కువ శక్తి ఖర్చయ్యే పక్క కండ్లు క్రమంగా అంతరించిపోయాయి. మిగిలిందల్లా మధ్యలో ఉన్న సెన్సార్లు, ఫొటోరిసె ప్టర్ల సమూహం మాత్రమే. ఇది పగలు, రాత్రిని, హెచ్చుతగ్గులను గుర్తించడానికి ఇప్పటికీ ఉపయోగపడుతున్నది. ఈ ఇసుకలో పూడుకుపోయే దశే వెన్నెముక జీవులు మిగతావాటికంటే భిన్నంగా ఉండడానికి కారణమని పరిశోధకులు సూచిస్తున్నారు. మిగతా అన్ని జంతువంశాలు తమ పక్క కండ్లను అలాగే ఉంచుకోగా, మనం మన కండ్లను కోల్పోయాము. ఒకరోజు వాటిని మళ్లీ కొత్తగా సృష్టించుకోవాల్సి వచ్చింది. అయితే అసలైన కన్ను పూర్తిగా మాయం కాలేదు. ఇది పీనియల్ గ్రంథిగా ఉండిపోయింది. ఇది సింహాల నుంచి బల్లులు, మీ వరకు దాదాపు అన్ని వెన్నెముక జీవులలో ఇప్పటికీ ఉన్నది. ట్యుటారాలు, కొన్ని ఇతర సరీసృపాలలో ఆ కణాలు దాదాపు పూర్తిగా రూపుదిద్దుకొన్న కన్నులాగే మిగిలిపోయాయి. చేపలలో ఇది కాంతిని నేరుగా గుర్తించే ఒక సరళమైన అవయవంగా ఉంది. క్షీరదాలలో ఇది ఆ సామర్థ్యాన్ని కోల్పోయింది. దానికి బదులుగా కండ్ల నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా కాంతి సంకేతాలను అందుకుంటుంది.
కంటికి ముందటి కన్ను
ఈ మూల కథ కొన్ని అద్భుతమైన అర్థాలను ఇస్తున్నది. మన కంటి వెనుక ఉండే కాంతి సున్నితమైన కణజాల పొర అయిన రెటీనా ప్రాథమిక రూపం ఇప్పటికే మధ్య కంటిలో నిర్మించబడింది. మనం ఇప్పుడు చూస్తున్న కండ్లలో కొత్తగా కనుగొనబడడం కంటే దాని అధునాతనత ఎక్కువగా అక్కడి నుంచే వారసత్వంగా వచ్చింది. అయితే మధ్య కంటిని కన్ను అని పిలవడం కొంతవరకు అతిశయోక్తి అని బాడెన్ వివరిస్తున్నారు. “తలపై మొదట ఉన్నది ఒక కన్ను కాదు. ఇది కేవలం కొన్ని సెన్సార్లు, ఫొటోరిసెప్టర్ల బహుళ ప్యాచ్‌ల సమూహం లాంటిది” అని ఆయన చెప్పారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన మరొక ఇటీవలి అధ్యయనం ప్రకారం.. మన పూర్వీకులకు ఒకప్పుడు లెన్స్‌లు, రెటీనాలతో కూడిన నాలుగు కండ్లు ఉండేవని సూచిస్తున్నది. ఈ సిద్ధాంతాలు సరైనవా కాదా అనే దానిపై తుది నిర్ణయం ఇంకా రాలేదు. అర బిలియన్ సంవత్సరాల పరిణామ చరిత్రను ఒకచోట చేర్చడం అంత చిన్న విషయం కాదు. అయినప్పటికీ త్వరలోనే మనకు సమాధానాలు లభిస్తాయని బాడెన్ నమ్మకంగా ఉన్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

