NDA Recruitment | సాయుధ దళాల్లో ఉద్యోగాలు.. పది, ఇంటర్ అర్హతతోనే భారీగా వేతనం..!
NDA Recruitment | నిరుద్యోగులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత సాయుధ దళాల జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఈ సంస్థ.. తాజాగా పదో తరగతి, ఇంటర్ అర్హతతో గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
NDA Recruitment: నిరుద్యోగులకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత సాయుధ దళాల జాయింట్ డిఫెన్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఈ సంస్థ.. తాజాగా పదో తరగతి, ఇంటర్ అర్హతతో గ్రూప్-C ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు NDA అధికారిక పోర్టల్ nda.nic.in ను విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటికే అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 16తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్‌కు ట్రైనింగ్ ఇస్తారు. మహారాష్ట్ర పూణేలోని ఖడక్ వాస్లాలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్.. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై-సర్వీస్ అకాడమీగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ తాజా రిక్రూట్మెంట్లో భాగంగా లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మన్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి పోస్టులు కలిపి మొత్తం 198 ఖాళీలను భర్తీ చేయనుంది.
పోస్టుల వివరాలు
లోయర్ డివిజన్ క్లర్క్-16 పోస్టులు, స్టెనోగ్రాఫర్ GDE-II-1, డ్రాఫ్ట్స్‌మ్యాన్-2, సినిమా ప్రొజెక్షనిస్ట్ II-1, కుక్-14 పోస్టులు భర్తీ కానున్నాయి. కంపోజిటర్ కమ్ ప్రింటర్- 1, సివిల్ మోటార్ డ్రైవర్ (OG)-3, కార్పెంటర్-2, ఫైర్‌మెన్-2, టీఏ బేకర్ అండ్ కన్ఫెక్షనర్-1, టీఏ సైకిల్ రిపేరర్-2, టీఏ ప్రింటింగ్ మెషిన్ ఆపరేటర్-1, టీఏ బూట్ రిపేరర్-1, ఎంటీఎస్ ఆఫీస్ అండ్ ట్రైయినింగ్-151 పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయో పరిమితి: NDA గ్రూప్-C రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి పాసై ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్ అర్హతగా ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదట ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. రెండింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్ లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు: దరఖాస్తుదారులు NDA గ్రూప్-C రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకునే సమయంలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరకాస్తు ఎలా..?
ముందుగా NDA అధికారిక పోర్టల్ nda.nic.in ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి కిందికి స్క్రోల్ చేస్తూ ‘న్యూస్ అండ్ ఈవెంట్స్’ అనే సెక్షన్లో NDA గ్రూప్-C రిక్రూట్మెంట్-2024 అనే లింక్ క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి. ఆ తర్వాత ‘అప్లై నౌ’ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. ముందుగా పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయాలి. ఫామ్‌లో అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
జీతభత్యాలు: NDA గ్రూప్-C రిక్రూట్మెంట్లో ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.18,000 నుంచి రూ. 63,200 మధ్య లభిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

