న్యూఢిల్లీ : నాసాకు చెందిన గొడ్డర్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఉత్తర ధృవ మండలంలో కనిపించే ప్రకాశం (అరోరా బొరియాలిస్)లోకి సౌండింగ్ రాకెట్‌ను పంపించింది. ఆ ప్రకాశ కాంతుల ప్రభావం భూమి వాతావరణంపై ఏ విధంగా ఉంటుందో పరిశీలించేందుకు దీనిని ప్రయోగించింది. ఈ ప్రయోగంతో అరోరాస్, భూమి వాతావరణం మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు ఉపయోగపడే సమాచారం లభించింది.