న్యూఢిల్లీ : ఇద్దరు వ్యక్తులు పరిసరాలను మరిచి వీధిలో డ్యాన్స్ వేస్తూ ఉల్లాసంగా గడిపిన వీడియోను నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ ఇన అలాంగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి మరో వ్యక్తితో కలిసి వీదిలో డ్యాన్స్ చేస్తుండటం కనిపించింది. మైఖేల్ జాక్సన్ సిగ్నేచర్ స్టెప్స్‌ను వీరు ప్రయత్నిస్తున్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
अगर जीवन में ख़ुशी चाहते हो तो !
लोगो की बातों को दिल से लगाना छोड़ दो !! pic.twitter.com/ChDPnFNA9J
— Temjen Imna Along (@AlongImna) December 18, 2022
మీరు జీవితంలో సంతోషాన్నికోరుకుంటే ప్రజల మాటల్ని హృదయానికి తీసుకోవద్దని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ట్విట్టర్ షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోకు ఇప్పటివరకూ 72,000కుపైగా వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఎంత సంతోషంతో స్టెప్పులేశారో అలాంటి ఆనందమయ జీవితం అందరిలోనూ రావాలని పలువురు యూజర్లు ఆకాంక్షించారు.
వేషధారణను బట్టి ఎప్పుడూ ఎవరినీ జడ్జ్ చేయకండని మరో యూజర్ రాసుకొచ్చారు. ఈ వీడియో ఈరోజు తన ముఖంపై నవ్వులు పూయించిందని మరో యూజర్ కామెంట్ చేశారు. వీరి సంతోషం చాలా స్వచ్ఛమైనదని మరో ట్విట్టర్ రాసుకొచ్చారు.