Temjen Imna Along: అమ్మాయిలతో గ్రూప్ ఫోటో.. జోకేసిన మంత్రి
Temjen Imna Along: అమ్మాయిలు మంత్రితో ఫోటో దిగారు. కానీ ఆ మంత్రి మాత్రం తన ఫుడ్‌పైనే ఫోకస్ పెట్టారు. ఆ ఫోటోను ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేస్తూ కామెంట్ రాశారు. ఫన్నీగా ఉన్న ఆ కామెంట్ అందర్నీ నవ్విస్తోంది.
నాగాలాండ్: నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలెంగ్(Temjen Imna Along) జోకులు వేయడంలో దిట్ట. తన సెన్స్ ఆఫ్ హ్యామర్‌తో ఆయన అందర్నీ ఆకట్టుకుంటారు. ఇక తన సోషల్ మీడియా అకౌంట్లో ఆయన తరుచూ విలువైన సందేశాలను పోస్టు చేస్తుంటారు. హృదయానికి హత్తుకునే వీడియోలను షేర్ చేస్తుంటారు. ఇక ఆయన పెట్టే పోస్టులకు కామెంట్లు కూడా అదిరిపోతుంటాయి. తాజాగా మంత్రి టెంజెన్ తన ట్విట్టర్లో ఓ కొత్త పోస్టు చేశారు. కుర్చీపై కూర్చుని పరోటా తింటున్న ఆయన చుట్టూ అమ్మాయిలు నిలబడ్డారు. అయితే మంత్రి టెంజెన్ మాత్రం ప్లేట్లో ఉన్న పరోటాలను చూస్తూ ఉండిపోయారు. ఫుడ్ మీదే ఆయన ధ్యాస అంతా ఉంది. ఇక అమ్మాయిలు మాత్రం కెమెరా వైపు ఫోజులు ఇచ్చారు.
Girls, I promise I'm not ignoring you. I'm just having a moment with my food. 😉 pic.twitter.com/Dg6psXJR1w
— Temjen Imna Along (@AlongImna) April 3, 2023
ఈ ఫోటోకు మంత్రి ఇచ్చిన క్యాప్షన్ ఓ ఫన్ క్రియేట్ చేసింది. అమ్మాయిలను పట్టించుకోకుండా పరోటా తింటున్న ఆ మంత్రి తన క్యాప్షన్‌లో అమ్మాయిల గురించి రాశారు. గర్ల్స్ .. నేను మిమ్మిల్ని పట్టించుకోవడం లేదని అనుకోకండి, ప్రస్తుతం ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తన కామెంట్లో ఆయన రాశారు. ఈ ఫోటోకు భారీగా లైక్‌లు, షేర్లు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ఈ ఫోటోను ఆరు లక్షల మంది చూశారు. 19వేల మంది లైక్ కొట్టేశారు.
ఇక నెటిజెన్లు కూడా రకరకాల కామెంట్లతో చెలరేగిపోతున్నారు. ఆకలితో ఉన్నవాడికి, ఆహారానికి మధ్య ఎవరూ వెళ్లకూడదని ఓ నెటిజన్ అన్నారు. గర్ల్స్ కూడా మిమ్మిల్ని పట్టించుకోవడం లేదని అనుకోకండి.. వాళ్లు జస్ట్ కెమెరాతో సమయం గడుపుతున్నారని ఓ నెటిజెన్ పంచ్ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

