న్యూఢిల్లీ, మే 8: పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు, న్యూకెలడోనియాకు మధ్య ‘ఫాంటం ద్వీపం’ ఉంది. ఇది గూగుల్ మ్యాప్స్‌తో దాగుడు మూతలు ఆడుతున్నది. ఒక్కోసారి కనిపిస్తున్నది.. ఒక్కోసారి మాయమైపోతున్నది.
తొలిసారిగా ఈ ద్వీపాన్ని 1776లో బ్రిటీష్‌కు చెందిన కెప్టెన్ జేమ్స్ కుక్ రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ తర్వాత 1895లో ఈ ద్వీపం కనిపించింది. గూగుల్ ఎర్త్‌లో, వేరే మ్యాప్స్‌లో ఉందని 2012లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అక్కడికి వెళ్లి చూడగా, అక్కడ ఎలాంటి ద్వీపం లేదని గుర్తించారు.