MCD Election 2022 | నా పేరు ఏ లిస్టులో లేదు.. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడి ఓటు గల్లంతు
MCD Election 2022 | ఢిల్లీలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. సామాన్యులు, నేతలు పోలింగ్ బూత్‌లకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో
న్యూఢిల్లీ: ఢిల్లీలో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. సామాన్యులు, నేతలు పోలింగ్ బూత్‌లకు వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓటేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చిన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరికి విచిత్ర పరిస్థితి ఎదురైంది.
ఓటర్ లిస్టులో ఆయన పేరు లేదని సిబ్బంది చెప్పడంతో షాకయ్యారు. పోనీ డిలీటెడ్ లిస్టులో అయినా ఆయన పేరు ఉందా అంటే అది కూడా లేదు. ఏకంగా ఒక పార్టీ అధ్యక్షుడి ఓటు కూడా గల్లంతవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన పేరు ఓటర్ లిస్టులోగానీ, డిలీటెడ్ లిస్టులోగానీ లేదని, ఏం జరిగిందనే విషయంలో అధికారులు చెక్ చేస్తున్నారని అనిల్ చౌదరి చెప్పారు.
అనిల్ చౌదరితోపాటు డల్లుపుర పోలింగ్ బూత్‌కు వచ్చిన ఆయన భార్య మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో గత 15 ఏండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

