బీహార్‌లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళ
తొలి ముస్లిం మహిళ| బీహార్‌లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళగా రజియా సుల్తాన్ రికార్డుల్లో నిలిచింది. గోపాల్‌గంజ్ జిల్లాలోని హతువా గ్రామానికి చెందిన ఆమె 64వ బీహార్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఎగ్జామ్స్‌లో (బీపీఎస్సీ) బీహార్ పోలీస్ ఫోర్స్‌లో డీఎస్పీగా ఎంపికయ్యారు.

పట్నా: బీహార్‌లో డీఎస్పీగా ఎంపికైన తొలి ముస్లిం మహిళగా రజియా సుల్తాన్ రికార్డుల్లో నిలిచారు. గోపాల్‌గంజ్ జిల్లాలోని హతువా గ్రామానికి చెందిన ఆమె 64వ బీహార్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఎగ్జామ్స్‌లో (బీపీఎస్సీ) బీహార్ పోలీస్ ఫోర్స్‌లో డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీలుగా ఎంపికైన 40 మందిలో రజియ ఒకరు. ప్రస్తుతం ఆమె బీహార్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.
రజియాది గోపాల్‌గంజ్ అయినప్పటికీ విద్యాభ్యాసం మాత్రం జార్ఖండ్‌లోని బొకారోలో పూర్తయ్యింది. ఆమె తండ్రి మహమ్మద్ అస్లామ్ అన్సారీ బొకారో స్టీల్ ప్లాంట్‌లో స్టెనోగ్రాఫర్‌గా పనిచేశారు. దీంతో ఆమె బొకారోలో పాఠశాల విద్య పూర్తిచేశారు. జోధ్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ కంప్లీట్‌చేశారు.
చిన్నప్పటి నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయాలన్నది తన కల అని, డీఎస్పీగా ఎంపికవ్వడంతో తన కల సాకారమయ్యిందని రజియా చెప్పారు. 2017లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను బీపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాని తెలిపారు. పోలీస్ అధికారిగా పనిచేయనుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు సరైన న్యాయం అందని సందర్భాలు చాలా ఉన్నాయి, అందులో ముఖ్యంగా మహిళలు ఉన్నారు. మహిళలు తమకు జరిగే అన్యాయాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనకడుగువేస్తున్నారు. ఇలాంటి కేసులు నమోదయ్యేలా తనవంతుగా ప్రయత్నిస్తానని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Bihar Police
- BPSC
- dsp
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

