Murder | దొంగలుగా భావించి ఇద్దరి దారుణ హత్య.. నలుగురు నిందితుల అరెస్ట్..
Murder | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా కొట్టిచంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రన్హొల్లా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Murder : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. దొంగలుగా భావించి ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా కొట్టిచంపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రన్హొల్లా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రన్హొల్లా ఏరియాలోగల ఓ బార్లో రాజేష్ యాదవ్, ముకేశ్ సింగ్ అనే ఇద్దరు స్నేహితులు మద్యం సేవిస్తుండగా.. అక్కడికి కత్తులు, కర్రలతో వచ్చిన నలుగురు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టి, కత్తులతో పొడిచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
దాంతో ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ‘మార్చి 15న మా స్నేహితులను ఇద్దరు వ్యక్తులు దోపిడీ చేశారని, శుక్రవారం ఆ దొంగల ముఠాకే చెందిన ఇద్దరు దొంగలు బార్లో మద్యం తాగుతున్నారని సమాచారం అందడంతో వెళ్లి దాడికి పాల్పడ్డామని’ పోలీసుల ఇంటరాగేషన్ నిందితులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

