Munawar Faruqui | లారెన్స్ గ్యాంగ్ హిట్‌లిస్టులో కమెడియన్ మునావర్ ఫరూఖీ.. ఎందుకంటే..!
Munawar Faruqui | హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హాస్యనటుడు మునావర్ ఫరూఖీని కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తమ హిట్‌లిస్టులో చేర్చుకున్నట్లు తేలింది. మునావర్ ఫరూఖీని అంతమొందించేందుకు సెప్టెంబర్‌లోనే బిష్ణోయ్ గ్యాంగ్ ఫ్లాన్ చేసిందని, కానీ తృటిలో అతడు తప్పించుకున్నాడని తాజా విచారణలో వెల్లడైంది.
Munawar Faruqui : హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హాస్యనటుడు మునావర్ ఫరూఖీని కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తమ హిట్‌లిస్టులో చేర్చుకున్నట్లు తేలింది. మునావర్ ఫరూఖీని అంతమొందించేందుకు సెప్టెంబర్‌లోనే బిష్ణోయ్ గ్యాంగ్ ఫ్లాన్ చేసిందని, కానీ తృటిలో అతడు తప్పించుకున్నాడని తాజా విచారణలో వెల్లడైంది. మునావర్ ఫరూఖీని మట్టుబెట్టి లారెన్స్ బిష్ణోయ్ తనకు తానుగా ‘హిందూ అండర్ వరల్డ్ డాన్’గా ముద్ర వేయించుకోవాలని అనుకున్నట్లు తెలిసింది.
గత సెప్టెంబర్‌లో మునావర్ ఫరూఖీ ముంబై నుంచి విమానంలో ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా.. అదే విమానంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు అనుచరులు ఫరూఖీని అనుసరించారు. ఢిల్లీలో ఫరూఖీ బసచేసే హోటల్లోనే గదులు కూడా బుక్ చేసుకున్నారు. అయితే మునావర్‌పై దాడి గురించి ముందే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి పోలీసులకు నివేదిక అందడంతో.. అతడిని అప్పటికప్పుడు ముంబైకి తరలించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
అప్పుడు తప్పించుకున్నా మునావర్ ఫరూఖీ ఇప్పటికీ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్‌లిస్టులో ఉన్నట్లుగా పోలీసుల తాజా దర్యాప్తులో తేలింది. అదునుచూసి మునావర్‌ను చంపేందుకు గ్యాంగ్ ప్రణాళిక రచించినట్లుగా ముంబై పోలీసులు గుర్తించారు. దాంతో ఫరూఖీకి పోలీసులు భద్రతను కొనసాగిస్తున్నారు. ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య తర్వాత ముంబై తీవ్ర కలకలానికి గురైంది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఇక పోలీసుల విచారణలో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిష్ణోయ్ గ్యాంగ్ లిస్టులో సిద్ధిఖీ కుమారుడు, ప్రస్తుత ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కూడా ఉన్నట్లు తేలింది. హిట్‌లిస్టులో ఉన్న మరికొందరి పేర్లు కూడా తాజాగా వెలుగులోకి వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ అండర్ వరల్డ్ డాన్ కావాలనే కోరికతోనే బాబా సిద్ధిఖీని చంపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

