Atal Setu : ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్నఅటల్ సేతు (ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్)ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు. భారత్‌లో అతిపెద్ద సముద్ర వంతెన అటల్ సేతును జాతికి అంకితం చేసిన వెంటనే ప్రజలు ఈ బ్రిడ్జిపై తమ వాహనాలను నిలిపివేసి సెల్ఫీలు తీసుకుంటూ సీ వ్యూను ఆస్వాదిస్తున్నారు.
కొందరు బ్రిడ్జి పరిసర ప్రాంతాలను చూసేందుకు వెళుతుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అటల్ సేతుపై ఆగి ఫొటోలు క్లిక్‌మనిపించడం చట్టవిరుద్ధమని ముంబై పోలీసులు హెచ్చరించారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌పై ఆగి, ఫొటోలు తీసుకునేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
అటల్ సేతు చూడదగిన ప్రదేశమని తాము అంగీకరిస్తామని, అయితే ఈ ప్రతిష్టాత్మక వంతెనపై ఆగి ఫొటోలు తీయడం సరైంది కాదని, ఈ వంతెనపై నిలిచి హంగామా చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ముంబై పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రజలను హెచ్చరించారు.
Read More :