బ్యుటీషియన్‌పై లైంగిక దాడి.. ప్రముఖ బాలీవుడ్ నటి బాడీగార్డ్‌పై కేసు
బ్యుటీషియన్‌పై లైంగిక దాడి | పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఓ యువతిని మోసం చేశాడని ప్రముఖ బాలీవుడ్ నటి బాడీగార్డుపై కేసు నమోదైంది.

ముంబై : పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఓ యువతిని మోసం చేశాడని ప్రముఖ బాలీవుడ్ నటి బాడీగార్డుపై కేసు నమోదైంది. ముంబై నగరంలోని అథేరీ ప్రాంతంలోని ఈ ఘటన జరిగింది. ప్రముఖ బాలీవుడ్ నటి వద్ద బాడీగార్డు పనిచేసే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 50 వేలు తీసుకొని తనపై లైంగిక దాడి చేశాడని ఓ బ్యుటీషియన్ అథేరీ పరిధిలోని డీఎస్ నగర్ పోలీసులకు ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిపై ఐపీసీ 376 (లైంగిక దాడి ఆరోపణ), 420 (చీటింగ్) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కేసుపై విచారణ జరుపుతున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

