AGI | కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన ముకుల్ రోహత్గీ
Mukul Rohatgi | భారత తదుపరి అటార్జీ జనరల్ (AGI) ఎవరనేదానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. ఏజీ పదవిని చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi)
న్యూఢిల్లీ: భారత తదుపరి అటార్జీ జనరల్ (AGI) ఎవరనేదానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. ఏజీ పదవిని చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ (Mukul Rohatgi) తిరస్కరించారు. అత్యున్నత న్యాయాధికారిగా సేవలందించేందుకు ఆయన నిరాకరించారు. గత కొన్ని రోజులుగా రోహత్గీ మరోసారి ఏజీ పదవిని చేపట్టనున్నారని, అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరిస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. అయితే తనకు ఆ పదవిపై ఆసక్తి లేదని రోహత్గీ ప్రకటించారు.
ప్రస్తుతం అటార్జీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ (91) సేవలు అందిస్తున్నారు. ఆయన పదివీకాలం జూన్‌లో ముగిసిపోయింది. దీంతో మూడు నెలలపాటు వేణుగోపాల్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగింది. ఈ నెల 30తో గడువు ముగియనుంది. వయో భారం కారణంగా మరోసారి ఆ పదవిలో కొనసాగడానికి ఆయన ఇష్టపడటం లేదు. దీంతో ప్రభుత్వం ముకుల్ రోహగ్నీ పేరును ప్రతిపాదించింది. దీనికి ఆయన తిరస్కరించారు.
సీనియర్ ముకుల్ రోహత్గీ 2014 నుంచి 2017 వరకు భారతదేశ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. అయితే 2017 జూన్‌లో వ్యక్తిగత కారణాలతో ఈ పదవికి రాజీనామా చేశారు. అనంతరం లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అనేక ప్రధానమైన కేసుల్లో ఆయన సుప్రీంకోర్టుతోపాటు దేశంలోని వివిధ హైకోర్టుల్లో తన వాదనలు వినిపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

