గ్రూప్ 23లో నా చాప్టర్ ముగిసింది… వారం కిందటే కాంగ్రెస్‌కు రాజీనామా: కపిల్ సిబల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అసంతృప్త నేతలతో కూడిన గ్రూప్ 23లో తన చాప్టర్ ముగిసిందని కపిల్ సిబల్ తెలిపారు. ఇక తాను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడని కాదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మద్దతుతో రాజ్యసభకు బుధవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన, ఈ నెల 16నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. 31 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో ఉన్న తాను ఆ కుటుంబాన్ని వీడటం అంత తేలిక కాదన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు. పార్టీ దయ వల్ల తాను అనేక పదవులను చేపట్టినట్లు గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మనోహరమైన, దయగల వ్యక్తి అని 73 ఏళ్ల కపిల్ సిబల్ కొనియాడారు. తాను ఆమెతో ఇటీవల సమావేశమైన సంగతిని అంగీకరించారు. అయితే ఈ భేటీ వ్యక్తిగతమన్న ఆయన, తమ మధ్య జరిగిన సంభాషణను బయట పెట్టేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ పుంజుకుని జాతీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.
మరోవైపు సమాజ్ వాదీ పార్టీలో చేరుతారన్న ఊహా గానాలను కపిల్ సిబల్ ఖండించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. ఎస్పీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగానే రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. తాను ఏదైనా పార్టీలో చేరితే పదో షెడ్యూల్ ప్రకారం అనర్హుడవుతానని అన్నారు. అందుకే ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదన్నారు. తన ఈ బహిరంగ ప్రకటన ఎప్పటికీ ఇదేనని స్పష్టం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా తనకు మద్దతు ఇచ్చిన సమాజ్‌వాదీ పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Congress
- G-23
- Kapil Sibal
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

