MPs Salary Hike | భారీగా పెరిగిన ఎంపీల జీతాలు.. గెజిట్ జారీ చేసిన కేంద్రం..
MPs Salary Hike | పార్లమెంట్ సభ్యుల వేతనాలు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంపీల జీతాలతోపాటు అలవెన్సులు, ఫించన్లను సైతం సవరించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
MPs Salary Hike | పార్లమెంట్ సభ్యుల వేతనాలు పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంపీల జీతాలతోపాటు అలవెన్సులు, ఫించన్లను సైతం సవరించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పెరిగిన వేతనాలు, అలవెన్సులు 2023 ఏప్రిల్ ఒకటి నుంచి వర్తిస్తాయని కేంద్రం పేర్కొంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నెలవారీ వేతనం ప్రస్తుతం రూ.లక్ష ఉండగా.. పెంపుతో రూ.1.24 లక్షలకు చేరింది. రోజువారీ భత్యం రూ.2వేల నుంచి రూ.2,500కి పెరిగింది. మాజీ ఎంపీల పెన్షన్ నెలకు రూ.25వేల నుంచి రూ.31వేలకు చేరింది. ఐదేళ్ల సర్వీస్ తర్వాత ప్రతి సంవత్సరం అదనపు పింఛన్‌ను రూ.2వేల నుంచి రూ.2,500 పెంచినట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో ఎంపీల జీతాలు, అలవెన్సులు, పింఛన్ల పెంపును ప్రకటించడం విశేషం. ఇంతకు ముందు 2018 ఏప్రిల్‌లో సిట్టింగ్, మాజీ ఎంపీలకు చెల్లించే జీతం, అలవెన్సులను కేంద్రం సవరించింది.
ద్రవ్యోల్బణం, జీవన వ్యయం పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఎంపీల మూల వేతనాన్ని నెలకు రూ.లక్షగా నిర్ణయించింది. 2018 సవరణ ప్రకారంగా, వేతనానికి అదనంగా ఎంపీలు కార్యాలయ నిర్వహణ, ఓటర్లతో సంబంధాలు కొనసాగించేందుకు నియోజకవర్గ భత్యంగా రూ.70వేలు పొందుతూ వస్తున్నారు. దాంతో పాటు నెలకు కార్యాలయ భత్యంగా రూ.60వేలు, పార్లమెంట్ సమావేశాల సమయంలో రోజువారీ భత్యంగా రూ.2వులు అందుకుంటున్నారు. తాజాగా అలవెన్సులు సైతం పెరగనున్నాయి. వీటితో పాటు ఎంపీలకు ఫోన్, ఇంటర్నెట్ కోసం వార్షిక భత్యం కేంద్రం చెల్లిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంవత్సరానికి 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు, వృత్తిపరమైన, వ్యక్తిగత ఉపయోగం కోసం ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం సైతం చేసేందుకు అవకాశం కల్పించింది. రోడ్డు మార్గం ద్వారా వెళితే అలవెన్స్ సైతం పొందొచ్చు. ఎంపీలు సంవత్సరానికి 50వేల యూనిట్ల ఉచిత విద్యుత్, నాలుగువేల కిలో లీటర్ల నీటిని పొందుతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

