ఆశ్చర్యం: 5.1 కిలోల బరువుతో ఆడ శిశువు జననం
Woman gave birth to 5.1 Kg girl: అక్కడ వైద్యులు ఆమెకు ప్రసవం చేయగా 5.1 కిలోల ఆడ శిశువు జన్మించింది. దాంతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతు అయ్యింది.

మాల్దా: మధ్యప్రదేశ్ రాష్ట్రం మాల్దా జిల్లాలో మిరాకిల్ చోటుచేసుకుంది. ఓ 29 ఏండ్ల మహిళ 5.1 కిలోల బరువున్న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మాల్దాకు చెందిన రక్షా కుశ్వాహ (29) అనే మహిళ శనివారం పురిటి నొప్పులతో అంజినీయ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు ప్రసవం చేయగా 5.1 కిలోల ఆడ శిశువు జన్మించింది. దాంతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతు అయ్యింది.
సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువులు 2.5 కేజీల నుంచి 3.7 కేజీల బరువు ఉంటారని, అంతకుమించిన బరువుతో శిశువులు జన్మించడం అత్యంత అరుదని వైద్యులు తెలిపారు. మరీ 5 కేజీలకు మించిన బరువుతో శిశువులు జన్మించడం మాత్రం అసాధారణమని చెప్పారు. రక్షా కుశ్వాహ జన్మనిచ్చిన పాప 5.1 కేజీల బరువు, 54 సెంటీమీటర్ల పొడవు ఉన్నదని ఆమెకు ప్రసవం చేసిన వైద్యుడు అజయ్ తోష్ వెల్లడించారు.
పాప ఆరోగ్యంగానే జన్మించినప్పటికీ.. ఆదివారం మధ్యాహ్నానికి మూత్ర విసర్జనలో సమస్య ఉన్నట్లు తేలిందని అజయ్ తోష్ చెప్పారు. అయితే సమస్య చిన్నదే అని, కొన్ని పరీక్షలు చేసి చికిత్స అందిస్తే సరిపోతుందని తెలిపారు. సాధారణంగా మధుమేహం, ఊబకాయం, హార్మోనల్ సమస్యలు ఉన్నవారికి శిశువులు అధిక బరువుతో జన్మించే అవకాశం ఉంటుందని, కానీ రక్షా కుశ్వాహకు ఆ సమస్యలు ఏవీ లేవని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

