Mount Everest’s poop problem | విసర్జించిన మలాన్ని సంచుల్లో తీసుకురావాలి.. ఎవరెస్ట్ పర్వతారోహకులకు కీలక సూచన
Mount Everest's poop problem | ఎవరెస్ట్ పర్వతారోహకులకు కొత్త నిబంధన విధించారు. ఇకపై పర్వతంపై విసర్జించిన మలాన్ని ప్రత్యేక సంచుల్లో బేస్ క్యాంప్‌కు తీసుకురావాలి. ఆ సంచులను విధిగా తనిఖీ చేస్తారు.
న్యూఢిల్లీ: ఎవరెస్ట్ పర్వతారోహకులకు కొత్త నిబంధన విధించారు. ఇకపై పర్వతంపై విసర్జించిన మలాన్ని ప్రత్యేక సంచుల్లో బేస్ క్యాంప్‌కు తీసుకురావాలి. ఆ సంచులను విధిగా తనిఖీ చేస్తారు. (Mount Everest’s poop problem) పర్వతారోహకుల మల విసర్జనలతో ఎవరెస్ట్ శిఖరం కంపు కొడుతున్నది. విపరీతంగా పేరుకుపోతున్న మల, ఇతర వ్యర్థాల వల్ల అనర్ధాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ పర్వత్వానికి చెందిన నేపాల్‌లోని పసాంగ్ లాము గ్రామీణ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
కాగా ఆ మున్సిపాలిటీ చైర్మన్ మింగ్మా షెర్పా ఈ కొత్త నిర్ణయం గురించి బీబీసీతో మాట్లాడారు. విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా పర్వతాలపై మల విసర్జన పూర్తిగా క్షీణించదని తెలిపారు. దీంతో పర్వతాల్లో దుర్వాసన వస్తున్నదని చెప్పారు. దీనివల్ల కొంత మంది పర్వతారోహకులు అనారోగ్యానికి గురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. ఈ పరిస్థితి ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్న ఆయన, తమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని, పొరుగున ఉన్న మౌంట్ లోట్సేను అధిరోహించాలనుకునే వ్యక్తులు రసాయనాలతో కూడిన ప్రత్యేక మల సంచులను బేస్ క్యాంప్‌లో కొనుగోలు చేయాలని మింగ్మా షెర్పా తెలిపారు. వారు బేస్ క్యాంప్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆ మల సంచులను తనిఖీ చేస్తారని చెప్పారు. ఈ చర్య ద్వారా ఎవరెస్ట్ పర్వతాలపై మల విసర్జాలను నివారించి అక్కడి పర్యావరణాన్ని కాపాడుతామని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

