Watch: ఎక్స్‌ప్రెస్ హైవేపై స్కూటర్‌ను ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరిపడిన తల్లీకొడుకు
Mother-son flung into air | ఎక్స్‌ప్రెస్ హైవేపై స్కూటర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై ప్రయాణించిన తల్లీకొడుకు గాల్లోకి ఎగిరిపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ మరణించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ఎక్స్‌ప్రెస్ హైవేపై స్కూటర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై ప్రయాణించిన తల్లీకొడుకు గాల్లోకి ఎగిరిపడ్డారు. (Mother-son flung into air) తీవ్రంగా గాయపడిన వారిద్దరూ మరణించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. జూలై 20న రాత్రి 7.30 గంటల సమయంలో ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై తల్లీ, కుమారుడు స్కూటర్‌పై వెళ్తున్నారు. అయితే రాంగ్ రూట్టో వేగంగా వచ్చిన కారు వారి స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్రంగా గాయపడిన తల్లీకొడుకును సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
కాగా, మృతులను ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యష్ గౌతమ్, 40 ఏళ్ల తల్లి మంజు దేవిగా పోలీసులు గుర్తించారు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని గంగా నదిలో స్నానం చేసి ఢిల్లీకి తిరిగి వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश : दिल्ली-मेरठ एक्सप्रेस-वे पर गाजियाबाद जिले में रॉन्ग साइड दौड़ रही कार ने स्कूटी सवार मां-बेटे को टक्कर मारकर मौत की नींद सुला दिया। मां–बेटा हरिद्वार से गंगा स्नान करके दिल्ली लौट रहे थे। pic.twitter.com/uAifxN88GO
— Sachin Gupta (@SachinGuptaUP) July 22, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- collides
- Flung Into Air
- Mother
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

