Mother Drowns Sons | పిల్లలను నదిలో ముంచిన తల్లి.. ఇద్దరు మృతి, ఒకరు మిస్సింగ్
Mother Drowns Sons | ఒక తల్లి దారుణానికి పాల్పడింది. నలుగురు పిల్లలను నదిలో ముంచింది. ఇద్దరు కుమారులు మరణించగా ఒక పిల్లవాడు అదృశ్యమయ్యాడు. పిల్లలు ఆకలితో ఏడ్వడాన్ని చూడలేకనే వారిని నదిలో ముంచి చంపినట్లు ఆ మహిళ పోలీసులకు చెప్పింది.
లక్నో: ఒక తల్లి దారుణానికి పాల్పడింది. నలుగురు పిల్లలను నదిలో ముంచింది. (Mother Drowns Sons) ఇద్దరు కుమారులు మరణించగా ఒక పిల్లవాడు అదృశ్యమయ్యాడు. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే పిల్లలు ఆకలితో ఏడ్వడాన్ని చూడలేకనే వారిని నదిలో ముంచి చంపినట్లు ఆ మహిళ పోలీసులకు చెప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరావా గ్రామానికి చెందిన ప్రియాంకకు నలుగురు పిల్లలు. ఏడాదిన్నర కిందట ఆమె భర్త చనిపోయాడు. నాటి నుంచి బంధువు ఇంట్లో ఆమె నివసిస్తున్నది.
కాగా, గురువారం ఉదయం ప్రియాంక తన నలుగురు పిల్లలను కేశంపూర్ ఘాట్ వద్దకు తీసుకెళ్లింది. బాంబా నదిలో వారిని ముంచింది. నాలుగు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు. ఏడాదిన్నర వయస్సున్న చిన్నారి కనిపించడం లేదు. అయితే ఆరేళ్ల వయస్సున్న పెద్ద పిల్లవాడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ ఘాట్ వద్దకు చేరుకున్నారు. నదిలో మునిగి మరణించిన ఇద్దరు పిల్లల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రియాంకను అరెస్ట్ చేశారు. ఆమెను ప్రశ్నించగా పిల్లలను తానే చంపినట్లు ఒప్పుకున్నది. వారు ఆకలితో ఏడుస్తుంటే తట్టుకోలేక ఇలా చేసినట్లు చెప్పింది. ఇది విన్న పోలీసులు షాక్ అయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ममता हुई शर्मसार…!😭
कलयुगी मां ने अपने ही 2 मासूम बच्चों को पानी में डुबोकर मार डाला..!यूपी के औरैया में प्रियंका नाम की महिला अपने 4 बच्चो के साथ घाट पर गई थी जहां उसने अपने बच्चों को डुबाकर मारा, बताया जा रहा है की एक बच्चा मौके पर सकुशल मिला वही दो बच्चों के शव घाट से… pic.twitter.com/9nIw4a9xTI
— Rahul Saini (@JtrahulSaini) June 27, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

