టార్గెట్ ఏఐఎస్‌లు.. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే అంతే..
2014లో ప్రధానిగా మోదీ గద్దెనెక్కినప్పటి నుంచి అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులకు దినాం లిట్మస్ టెస్టుగానే గడుస్తున్నది. తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులపై లక్షిత దాడులు చేయించటం, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీల పేరిట వేధించటం, అవినీతి, క్రమశిక్షణ చర్యల సాకుతో ముందస్తు పదవీ విరమణకు ఒత్తిడి చేయటం
- బలవంతంగా రిటైర్మెంట్.. లేకుంటే అక్రమ కేసులు
- ఎనిమిదేండ్లలో వందల మంది ఆఫీసర్లు ఇంటికి
- ప్రధాని మోదీ పాలనలో ఏఐఎస్‌లకు డైలీ లిట్మస్ టెస్టు
- తాజాగా ఐపీఎస్ సతీశ్ చంద్రపై కేంద్రం అక్కసు
అన్ని పనులు బాబులే (ఐఏఎస్‌లను ఉద్దేశించి) చేయగలరా? ఐఏఎస్ అయినంత మాత్రాన వాళ్లు ఎరువుల ఫ్యాక్టరీని, ఆకాశంలో విమానాలను నడపగలరా? వాళ్లకు ఎక్కువ అధికారాలను కట్టబెట్టాం. ఇక, దేశ పగ్గాలనూ వాళ్లకు అప్పజెప్తే మనకు మిగిలేది ఏముంటుంది? బాబులూ సాధారణ పౌరులే – – 2021 ఫిబ్రవరిలో పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ ఐఏఎస్‌లపై వెళ్లగక్కిన అక్కసిది.
ఏఐఎస్‌లపై బీజేపీ నేతల జులుం ఇలా..
- నువ్వు ఐఏఎస్వేనా? కేంద్రం ఎంత బియ్యం ఇస్తున్నదో కూడా తెలియదా? రేషన్ దుకాణంలో ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదు? నేను మళ్లీ వచ్చేసరికి మోదీ ఫొటో పెట్టాలి. లేకపోతే, నేనే ఫొటో పెట్టి వెళ్తా. ఆపై మీ ఇష్టం.
- 2022 సెప్టెంబర్ 2న కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
రాత్రి ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైమోడ్ లేదంటూ మాకు కహానీలు చెప్పకు. వెంటనే, మా చార్టెర్డ్ ఫ్లైట్ టేకాఫ్ కావాలి. క్లియరెన్స్ ఇస్తారా? లేదా? - 2022 సెప్టెంబర్ 3వ తేదీన జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ విమానాశ్రయంలో ఎయిర్ పోర్టు అధికారులపై బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ దురుసు ప్రవర్తన
(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ)
2014లో ప్రధానిగా మోదీ గద్దెనెక్కినప్పటి నుంచి అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులకు దినాం లిట్మస్ టెస్టుగానే గడుస్తున్నది. తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులపై లక్షిత దాడులు చేయించటం, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీల పేరిట వేధించటం, అవినీతి, క్రమశిక్షణ చర్యల సాకుతో ముందస్తు పదవీ విరమణకు ఒత్తిడి చేయటం, వినకపోతే సస్పెండ్ చేయించటం బీజేపీ సర్కారుకు నిత్యకృత్యంగా మారిపోయింది. గత ఎనిమిదేండ్లలో తమ మాట వినని దాదాపు 400 మంది ఏఐఎస్‌లను మోదీ ప్రభుత్వం సాగనంపింది.
తాజాగా గుజరాత్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సతీశ్ చంద్రను కేంద్ర హోంశాఖ డిస్మిస్ చేసింది. రిటైర్మెంట్కు నెల రోజులే ఉందనగా ఈ నిర్ణయం తీసుకొన్నది. డిస్మిస్ అంటే.. ఆయనకు పదవీవిరమణ తర్వాత పెన్షన్, ఇతర ప్రయోజనాలు అందవు. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలా.. ఏఐఎస్‌లపై మోదీ ప్రభుత్వం సాగిస్తున్న వేధింపుల పర్వం మరోసారి చర్చకు వచ్చింది.
ఐఆర్ఎస్ వసుంధరా సిన్హా బదిలీ
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆదాయపు పన్నుశాఖ డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్స్) వసుంధరా సిన్హాను కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ముంబైకి బదిలీ చేసింది. ఆమె స్థానంలో సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్, ఆదాయపు పన్నుశాఖ అదనపు కమిషనర్ సంజయ్ బహదూర్‌ను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులు సోమవారం సాయంత్రం వెల్లడైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామాలు హైదరాబాద్‌లో అఖిలభారత సర్వీసు అధికారుల్లో (ఏఐఎస్) తీవ్ర చర్చకు దారితీశాయి.
ఐపీఎస్ వర్మ డిస్మిస్‌పై సుప్రీం స్టే
గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ సతీశ్‌చంద్ర వర్మను డిస్మిస్ చేస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. డిస్మిస్ ఆర్డర్‌ను వారం పాటు నిలుపుదల చేసింది. డిస్మిస్‌ను కొనసాగించాలా, వద్దా అన్నది ఢిల్లీ హైకోర్టే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

