Rajnath Singh | ఆధునిక యుద్ధాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయ్ : రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh | ఆధునిక యుద్ధాలు (Modern Conflicts) ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల (Economies) ను, సైబర్ స్పేస్ (Cyber Space) ను దెబ్బతీస్తున్నాయని రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. నేటి రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. యుద్ధాలు సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహారభద్రతలో భాగమయ్యాయని పేర్కొన్నారు.
Rajnath Singh : ఆధునిక యుద్ధాలు (Modern Conflicts) ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల (Economies) ను, సైబర్ స్పేస్ (Cyber Space) ను దెబ్బతీస్తున్నాయని రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. నేటి రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. యుద్ధాలు సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహారభద్రతలో భాగమయ్యాయని పేర్కొన్నారు. ఈ యుద్ధాల ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రతి దేశపౌరుడు అన్ని సమయాల్లో దేశ రక్షణకు సిద్ధమై ఉండాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. ఆధునిక యుద్ధాలకు అనుగుణంగా దేశంలో ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులోభాగంగా సాయుధ దళాలకు ఆధునాతన, స్వదేశీ ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దేశ రక్షణలో యువత తనవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఉత్తరాఖండ్‌లోని సైనిక పాఠశాల ఆవిర్భావ దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. యువత దేశం కోసం ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలిగేలా క్రమశిక్షణ, మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలని సూచించారు. సైన్యం, పౌరులు బలంగా ఉంటేనే దేశం ముందుకు సాగుతుందని అన్నారు. దేశ రక్షణలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్సీసీలో ప్రవేశాల సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
గతంలో 17 లక్షలుగా ఉన్న నియామకాలను 20 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పీపీపీ నమూనాలో దేశవ్యాప్తంగా 100 కొత్త సైనిక పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సైనిక పాఠశాలల్లో బాలికలు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారని, ఇది చారిత్రాత్మక ముందడుగు అన్నారు. ఇది దేశ ‘నారీ శక్తి’ని మరింత బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

