250 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తాం.. అసెంబ్లీ ఎన్నికలపై రాజ్‌థాకరే
MNS Chief Raj Thackeray: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే కీలక ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. 200 నుంచి 250 సీట్లలో పోటీకు దిగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే కీలక ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. 200 నుంచి 250 సీట్లలో పోటీకు దిగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్ర పరిపాలనపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. గుంతలు పూడ్చేందుకు నిధులు లేవు కానీ, లాడ్లీ బెహన్, లాడ్లా భాయ్ స్కీమ్‌ల కోసం డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని రాజ్‌థాకరే ప్రశ్నించారు. ఎన్సీపీపై రాజ్‌థాకరే కామెంట్ చేస్తూ.. ఒకవేళ లాడ్లా భాయ్, బెహన్ సంతోషంగా ఉంటే, అప్పుడు పార్టీలో చీలకలు వచ్చేవి కాదన్నారు.
రాష్ట్రంలో ఉన్న రాజకీయ గందరగోళం గురించి మాట్లాడుతూ.. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తెలియడం లేదన్నారు. తమ పార్టీలో నుంచి మరో పార్టీలో చేరాలనుకుంటున్నవాళ్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నట్లు చెప్పాడు. వాళ్లు త్వరగా వెళ్లిపోవచ్చు అని రాజ్ థాకరే తెలిపారు. ఇతర పార్టీల నుంచి డబ్బులు వసూల్ చేసేందుకు కొందరు అభ్యర్థులు రెఢీగా ఉన్నారని, దీన్ని సహించబోమని, నమ్మకం, గెలిచే అవకాశాల ఆధారంగానే టికెట్లను ఇవ్వనున్నట్లు చెప్పారు.
ప్రతి జిల్లాలోనూ సర్వేలను నిర్వహిస్తున్నట్లు రాజ్ థాకరే తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాష్ట్ర పర్యటన మొదలుఅవుతుందన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పార్టీ కేవలం ఒక్క సీటులో మాత్రమే గెలిచింది. తాజాగా ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

