Manohar Lal Khattar | మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్.. సాయంత్రం ప్రమాణం..?
Manohar Lal Khattar | హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తడంతో ముఖ్యమంత్రి (Haryana CM) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) మంగళవారం రాజీనామా ( resigns) చేశారు. సాయంత్రం 4 గంటలలోపు మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Manohar Lal Khattar | లోక్సభ ఎన్నికల ముందు హర్యానా రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. హర్యానాలో లోక్సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ-జేజేపీ కూటమిలో విభేదాలు తలెత్తడంతో ముఖ్యమంత్రి (Haryana CM) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) మంగళవారం రాజీనామా ( resigns) చేశారు. మంత్రిమండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను సమర్పించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా జేజేపీ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలలోపు మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటకు 46 సీట్లు అవసరం. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి మెజారిటీ తక్కువ రావడంతో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్కు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
Also Read..
Donald Trump | నేను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. క్యాపిటల్ హిల్ బందీలను విడిపిస్తా : ట్రంప్
Shah Rukh Khan | షారుక్ ఖాన్కు పాదాభివందనం చేసిన స్టార్ దర్శకుడు అట్లీ.. VIDEO
Seema Haider | సీఏఏ అమలును స్వాగతించిన పాక్ మహిళ సీమా హైదర్.. ప్రధాని మోదీపై ప్రశంసలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

