MK Stalin | టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ.. విజయ్ తీరుపై స్టాలిన్ విమర్శలు
MK Stalin | తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) సర్కారుపైన, ముఖ్యమంత్రి విజయ్ తీరుపైన డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీవీకే సర్కార్ బీజేపీకి 'జిరాక్స్ కాపీ' లా మారిందని, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేస్తూ ప్రతిపక్షాన్ని బలహీనపరిచే కుట్రకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
MK Stalin : తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) సర్కారుపైన, ముఖ్యమంత్రి విజయ్ తీరుపైన డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీవీకే సర్కార్ బీజేపీకి ‘జిరాక్స్ కాపీ’ లా మారిందని, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనుగోలు చేస్తూ ప్రతిపక్షాన్ని బలహీనపరిచే కుట్రకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. శనివారం చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగిన డీఎంకే మహిళా విభాగం సమావేశంలో స్టాలిన్ ప్రసంగించారు.
ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక వ్యూహాలనే తమిళనాడులో టీవీకే ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి విజయ్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేల కోసం ‘షాపింగ్’ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసి 21 రోజులు కూడా గడవకముందే వేలికి ఉన్న సిరా గుర్తు చెరగకముందే నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారని, వారికి ఎలాంటి ఆఫర్ ఇచ్చి చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మహిళల భద్రతాఅంశాన్ని ప్రస్తావిస్తూ శ్రీవైకుంఠంలో జరిగిన ఒక లైంగిక వేధింపుల ఘటనను స్టాలిన్ ఉదహరించారు. ఈ కేసులో బాధితురాలు టీవీకే సభ్యురాలైతే, నిందితులు కూడా అధికార పార్టీకి చెందినవారని ఆయన ఆరోపించారు. అయితే నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితురాలినే పార్టీ నుంచి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీవీకే కార్యకర్తల నుంచి మహిళలకు రక్షణ కల్పించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. గతంలో టీవీకే ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని స్టాలిన్ స్పష్టంచేశారు.
కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని భావించినప్పటికీ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు తనను మౌనంగా ఉండనివ్వడం లేదని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడం తమ ఉద్దేశం కాదని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా డీఎంకే తన పాత్రను పోషిస్తుందని ఆయన స్పష్టంచేశారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి మహిళా కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

