న్యూఢిల్లీ, జూలై 24: నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత వాట్సాప్ చాట్లో సందేశాలు వాటంతట అవే కనుమరుగవుతాయన్న విషయం తెలిసిందే. అయితే అలా కనిపించకుండా పోయిన మెసేజ్లను స్టోర్ చేసుకొని, తిరిగి చూసుకునే ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వాట్సాప్ మాతృసంస్థ మెటా వెల్లడించింది. చాట్ ఇన్ఫోలో ‘కెప్ట్ మెసేజెస్’ పేరిట తీసుకురానున్న ప్రత్యేక సెక్షన్లో ఈ మెసేజ్లను చూడొచ్చని వివరించింది. అయితే, ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా వెల్లడించలేదు.