దేశంలో 43 మందికే జెడ్‌ప్లస్ భద్రత : హోంశాఖ
Z Plus security | దేశంలో 43 మంది ప్రముఖులకు జెడ్ ప్లస్ భద్రత కల్పించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దేశంలో వీఐపీలు, వీవీఐపీలకు కొదవే లేదు. వ్యక్తిని బట్టి, హోదాను బట్టి భద్రత కల్పిస్తూ ఉంటారు. అయితే, అత్యున్నత భద్రతగా మాత్రం ‘జెడ్ ప్లస్'ను
హైదరాబాద్ : దేశంలో 43 మంది ప్రముఖులకు జెడ్ ప్లస్ భద్రత కల్పించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దేశంలో వీఐపీలు, వీవీఐపీలకు కొదవే లేదు. వ్యక్తిని బట్టి, హోదాను బట్టి భద్రత కల్పిస్తూ ఉంటారు. అయితే, అత్యున్నత భద్రతగా మాత్రం ‘జెడ్ ప్లస్’ను పిలుస్తుంటారు. జెడ్, వై ప్లస్ కేటగిరీల్లో ఎంత మందికి భద్రత కల్పిస్తున్నారు ? ఇందుకు ఎంత ఖర్చు చేస్తున్నారో వెల్లడించాలంటూ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ (యాక్) సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర హోం శాఖను కోరింది. దీనికి కేంద్ర హోంశాఖ పీఐవో రాజీవ్ శర్మ సమాధానం ఇచ్చారని యాక్ వ్యవస్థాపకుడు పల్నాటి రాజేంద్ర తెలిపారు.
ప్రముఖ వ్యక్తులకు పొంచి ఉన్న ప్రమాదం ఆధారంగా వారికి ఎక్స్, వై, వై ప్లస్, జెడ్, జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 43 ప్రముఖులకు జెడ్ ప్లస్, 66 మందికి జెడ్, 81 మందికి వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. భద్రతపై సమీక్షిస్తూ మరింత పెంచడమో, తగ్గించడమో చేస్తామని పేర్కొంది. అయితే భద్రతకు చేసే ఖర్చుల వివరాలు పూర్తిగా తమ దగ్గర ఉండవని కేంద్ర హోం శాఖ పేర్కొన్నది. భద్రత సిబ్బంది వేతనాలు, ప్రయాణ భత్యాలు, వాహనాలు వంటి ఖర్చులను సందర్భాన్ని బట్టి వివిధ ఏజెన్సీలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రత పొందే వ్యక్తులు, సంస్థలు భరిస్తాయని పేర్కొన్నది. భద్రత పొందే ప్రముఖుల వివరాలను మాత్రం వెల్లడించలేమని స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

