Migrant Worker | కుక్కలు ఉంచే గదిలో.. అద్దెకు నివసిస్తున్న వలస కార్మికుడు
Migrant Worker | ఒక వలస కార్మికుడు కుక్కలు ఉంచే గదిలో అద్దెకు నివసిస్తున్నాడు. ఆ ఇరుకు గదికి నెలకు రూ.500 అద్దె చెల్లిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.
తిరువనంతపురం: ఒక వలస కార్మికుడు (Migrant Worker) కుక్కలు ఉంచే గదిలో అద్దెకు నివసిస్తున్నాడు. ఆ ఇరుకు గదికి నెలకు రూ.500 అద్దె చెల్లిస్తున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్యామ్ సుందర్ నాలుగేళ్ల కిందట కేరళకు వచ్చాడు. వలస కార్మికుడిగా పని చేస్తున్నాడు. అయితే గత మూడు నెలలుగా పిరవోమ్లోని ఒక ఇంటి ఆవరణలో ఉన్న పాత డాగ్ కెన్నెల్‌లో అతడు నివసిస్తున్నాడు. ఆ ఇరుకైన కుక్కల గదికి నెలకు రూ.500 అద్దె చెల్లిస్తున్నాడు.
కాగా, ఈ విషయం మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కుక్కలు ఉంచే గదిలో అద్దెకు నివసిస్తున్న వలస కార్మికుడు శ్యామ్ సుందర్‌ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు తన ఇష్టప్రకారమే పాత డాగ్ కెన్నెల్‌లో ఉంటున్నట్లు వలస కార్మికుడు శ్యామ్ సుందర్ తెలిపాడు. ఎక్కువ అద్దె చెల్లించే స్థోమత తనకు లేదని చెప్పాడు. అందుకే నెలకు రూ.500 అద్దె చెల్లించి కుక్కల గదిలో నివసిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. అయితే కేరళ ప్రభుత్వం దీనిపై విచారణకు సోమవారం ఆదేశించింది. పూర్తి నివేదిక ఇవ్వాలని కార్మిక శాఖ మంత్రి వీ శివన్కుట్టి ఆ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

