Word Pad | న్యూఢిల్లీ: విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన వర్డ్ప్యాడ్ సేవల్ని నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించినట్టు ‘విండోస్ ఇన్సైడర్ బ్లాగ్’ తాజా కథనం పేర్కొన్నది. విండోస్ ఆపరేటింగ్-1995తో మొదలైన వర్డ్ప్యాడ్ సేవలు 28 ఏండ్లుగా కొనసాగాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మైక్రోసాఫ్ట్ వర్డ్, విండోస్ నోట్‌ప్యాడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ‘వర్డ్ప్యాడ్’ అవసరం తగ్గింది. దీంతో తదుపరి విండోస్ వెర్షన్ల నుంచి వర్డ్‌ప్యాడ్‌ను పూర్తిగా తొలగిస్తున్నామని, ఇకపై అప్లికేషన్‌ను రీ-ఇన్స్టాల్ చేయటం కుదరదని అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో మైక్రోసాఫ్ట్ తెలిపింది.