Satya Nadella | త్వరలో భారత్‌కు మైక్రోసాఫ్ట్ సీఈవో.. ఏఐ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న సత్య నాదెళ్ల..!
Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల త్వరలో భారత్‌లో ప్రకటించనున్నారు. డిసెంబర్లో ఢిల్లీ, ముంబయితో పాటు బెంగళూరు నగరాలను ఆయన ఈ పర్యటనలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఉద్యోగులను కలుస్తారని పలు నివేదికలు తెలిపాయి.
Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల త్వరలో భారత్‌లో ప్రకటించనున్నారు. డిసెంబర్లో ఢిల్లీ, ముంబయితో పాటు బెంగళూరు నగరాలను ఆయన ఈ పర్యటనలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఉద్యోగులను కలుస్తారని పలు నివేదికలు తెలిపాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. సత్య నాదెళ్ల తన పర్యటనలో అనేక కీలకమైన ఏఐ సంబంధిత సమావేశాల్లో ప్రసంగిస్తారని పేర్కొంది. కంపెనీ అధికారికంగా ఆయన పర్యటనను ధ్రువీకరించనప్పటికీ.. ఈ పర్యటన మైక్రోసాఫ్ట్‌కు వ్యూహాత్మకంగా కీలకమైందిగా భావిస్తున్నారు.
భారత్-అమెరికా సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఇటీవల రెండు దేశాలు విభేదాలను పక్కనపెట్టి సాంకేతిక భాగస్వామ్యంపై దృష్టి సారిస్తున్నాయి. మరో వైపు భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా యాప్‌లు, సేవలను ప్రోత్సహిస్తున్నది. జోహో కార్పొరేషన్ వంటి భారతీయ కంపెనీలు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా నిలువబోతున్నాయి. ఇదిలా ఉండగా.. సత్య నాదెళ్ల ఈ ఏడాది జనవరిలోనూ భారతలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా దేశంలో ఏఐ రంగంలో మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టలనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో ప్రకటించారు.
ఈ పర్యటన ఆయన దార్శనికతను ముందుకు తీసుకెళ్లే దిశలో మరో ముందడుగుగా భావిస్తున్నారు. భారత్‌లో AI రంగంలో పోటీ వేగంగా పెరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ డేటా సెంటర్‌ను నిర్మించడానికి రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని గూగుల్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ మద్దతు ఉన్న ఓపెన్ ఏఐ (OpenAI) భారతీయ వినియోగదారులకు చాట్‌జీపీటీ గో (ChatGPT Go) ఏడాది ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రకటించింది. నాదెళ్ల పర్యటన భారతదేశంలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పల్లా దేవేందర్ రెడ్డి
Spirit | ప్రభాస్ ‘స్పిరిట్’పై సెన్సేషనల్ అప్డేట్.. షూటింగ్‌కు ముందే ఎడిటింగ్ పనుల్లో బిజీగా సందీప్ రెడ్డి వంగా!
‘రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి’
Ritabrata Banerjee | టీఎంసీ రెబల్ వర్గానికి షాక్.. రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేసిన హైకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

