న్యూఢిల్లీ: ఫేస్బుక్ యూజర్ల పాస్వర్డ్స్ను దొంగిలిస్తున్న 400 ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్లను మెటా సంస్థ గుర్తించింది. ఈ యాప్ల జాబితాను షేర్ చేసింది. ఇందులోని చాలా అప్లికేషన్లు థర్డ్ పార్టీ యాప్ స్టోర్లలోనే ఉన్నాయి.
ఈ యాప్లు ఫొటో ఎడిటింగ్, వీపీఎన్ సర్వీసులు, ఇతర యుటిలిటీలను అందిస్తున్నట్టు మెటా తెలిపింది. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునే గేమింగ్ యాప్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇలాంటి యాప్లు డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే పాస్వర్డ్ మార్చుకోవాలని సూచించింది.