Smriti Irani: రుతుస్రావం వైకల్యం కాదు: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ
Smriti Irani: నెలసరి మహిళలకు పెయిడ్ లీడ్ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అన్నారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. మహిళల్లో కలిగే రుతుస్రావం వైకల్యం కాదు అని ఆమె తెలిపారు. ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ వేసిన ప్రశ్నకు ఆమె రియాక్ట్ అయ్యారు.
న్యూఢిల్లీ: మహిళల్లో జరిగే రుతుస్రావం వైకల్యం కాదు అని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ(Smriti Irani) అన్నారు. నెలసరి అయ్యే మహిళలకు పెయిడ్ లీవ్ ఇవ్వాలని ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ జా రాజ్యసభలో వేసిన ప్రశ్నకు ఆమె బదులు ఇచ్చారు. పెయిడ్ లీవ్‌ను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె చెప్పారు. మహిళలకు రుతుస్రావం కావడం సమస్య కాదు అని, నెలసరి, రుతుక్రమం వైకల్యమే కాదు అన్నారు. ఇది మహిళల జీవితాల్లో సహజమైన ప్రక్రియ అని మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు.
మహిళా ఉద్యోగులకు ఇచ్చే లీవ్‌ల అంశంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఆర్జేడీ నేత జా ప్రశ్న వేశారు. రుతుస్రావం వంకతో సమాన అవకాశాల్ని దూరం చేయడం కరెక్టు కాదు అని ఆమె అన్నారు. నెలసరి అయ్యే మహిళల ఆరోగ్యం విషయంపై తమ ప్రభుత్వం ఓ ముసాయిదాను తయారు చేసిందని మంత్రి తెలిపారు. 10 నుంచి 19 ఏళ్ల మధ్య అమ్మాయిల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక స్కీమ్‌ను అమలు చేస్తోందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

