టీఎంసీ నేత సాకేత్ గోఖలేపై.. మేఘాలయ ప్రభుత్వం పరువు నష్టం దావా
టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి అయిన సాకేత్ గోఖలే, ఈ నెల 4న మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు.
షిల్లాంగ్: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత సాకేత్ గోఖలేపై మేఘాలయ ప్రభుత్వం పరువు నష్టం దావా వేసింది. ఆయన ఇటీవల చేసిన అవినీతి ఆరోపణలపై ఈ మేరకు చర్యలు చేపట్టింది. టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి అయిన సాకేత్ గోఖలే, ఈ నెల 4న మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. మేఘాలయ ఎకో టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో రూ.632 కోట్ల అవకతవకలు జరిగాయని విమర్శించారు. సీఎం కాన్రాడ్ సంగ్మా అత్యున్నత సహాయకుడు, ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలోని మేఘాలయన్ ఏజ్ కంపెనీ ద్వారా ఈ అక్రమాలు జరిగాయని ఒక ప్రకటనలో ఆయన ఆరోపించారు.
కాగా, టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపణలపై మేఘాలయ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఆయన సైకో మాదిరిగా మారారని డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ టిన్సాంగ్ విమర్శించారు. తమ ప్రభుత్వ ప్రతిష్టను చెడగొట్టడమే టీఎంసీ నేత ఉద్దేశమని ఆరోపించారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వానికి చెందిన మేఘాలయన్ ఏజ్ లిమిటెడ్ సంస్థ లీగల్ చర్యలు చేపట్టింది. టీఎంసీ నేత సాకేత్ గోఖలేపై పరువు నష్టం దావా వేసింది. సీఎం సంగ్మాతోపాటు ప్రభుత్వంపై తప్పుడు, పరువు నష్టం కలిగించేలా మీడియాకు స్టేట్మెంట్లు ఇచ్చిన ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో క్రిమినల్ పరువునష్టం దావా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

